Loading...
Revanth Reddy: రేవంత్ రెడ్డితో పాటు ప్రమాణస్వీకారం చేసే మంత్రులు వీరే! 
Revanth Reddy: రేవంత్ రెడ్డితో పాటు ప్రమాణస్వీకారం చేసే మంత్రులు వీరే!

Revanth Reddy: రేవంత్ రెడ్డితో పాటు ప్రమాణస్వీకారం చేసే మంత్రులు వీరే! 

వ్రాసిన వారు Stalin
Dec 06, 2023
06:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. అయితే రేవంత్‌తో మంత్రులుగా ఎవరు? ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేబినెట్‌లో ఎవరెవరికి చోటు దక్కుతుందనేది అంశంపై చర్చ జరుగుతోంది. కేబినెట్ కూర్పు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. హైమాండ్ పిలుపు మేరకు మంగళవారం రాత్రి దిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ పెద్దలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేబినెట్‌లో ఎవరు ఉండాలనే లిస్ట్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం రేవంత్‌తో పాటు ప్రమాణస్వీకారం చేసే నేతల పేర్లను బుధవారం రాత్రి దిల్లీలో ఏఐసీసీ నేతలు ప్రకటించే అవకాశం ఉంది. అందుకే రేవంత్ ఇంకా దిల్లీలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

రేవంత్

రేవంత్ కేబినెట్ ఇదేనట!

తెలంగాణ కేబినెట్‌ను కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసినట్లు సోషల్ మీడియాలో ఓ లిస్ట్ చక్కర్లు కొడుతుంది. ఆ లిస్ట్‌ను ఒకసారి పరిశీలిద్దాం.

1.మల్లు భట్టి విక్రమార్క-ఉపముఖ్యమంత్రి

2.సీతక్క-హోంమంత్రిత్వ శాఖ

3.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి-ఆర్థిక శాఖ

4.కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి-మున్సిపల్ శాఖ

5.శ్రీధర్‌బాబు- విద్య,వైద్య,ఆరోగ్య శాఖ

6.తుమ్మల నాగేశ్వరరావు-రోడ్లు భవనాల శాఖ

7.దామోదర్‌ రాజనర్సింహ-పంచాయతీరాజ్‌

8.షబ్బీర్‌ అలీ-విద్యుత్‌ శాఖ

9.కొండా సురేఖ-మహిళా, శిశు సంక్షేమ శాఖ

10.మదన్‌మోహన్‌రావు-ఐటీ శాఖ

11.పొంగులేటి శ్రీనివాసరెడ్డి-జలవనరుల శాఖ

12.జూపల్లి కృష్ణారావు-పశు సంవర్థక శాఖ

13.ప్రేమ్‌సాగర్‌రావు-గ్రామీణాభివృద్ధి శాఖ

14.సుదర్శన్‌రెడ్డి-వ్యవసాయ శాఖ

15.జి.వివేక్-‌ఎస్సీ సంక్షేమ శాఖ

16.పొన్నం ప్రభాకర్‌-ఎక్సైజ్‌, బీసీ సంక్షేమ శాఖ

17.అద్దంకి దయాకర్-కార్మిక మంత్రిత్వ శాఖ

అయితే వీరులో ముఖ్యమైన ఆరుగురు మంత్రులు రేవంత్ రెడ్డితో పాటు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది.

ADVERTISEMENT