Page Loader
Tomato: మదనపల్లె మార్కెట్‌లో టమాటకు రికార్డు ధర.. కేజీ రూ.200
Tamato: మదనపల్లె మార్కెట్‌లో టమాటకు రికార్డు ధర.. కేజీ రూ.200

Tomato: మదనపల్లె మార్కెట్‌లో టమాటకు రికార్డు ధర.. కేజీ రూ.200

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 29, 2023
03:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె టమాటాలకు పేరుగాంచింది. ఈసారి ఇక్కడ టమాట ధరలు రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తున్నాయి. తాజాగా మదనపల్లె మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ.200కి చేరింది. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ధర పలికిందని స్థానికులు చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఆంగళ్లు, హోల్‌సేల్ మార్కెట్లో రూ.140 పలికిన టమాట ధర..నేడు మదనపల్లె మార్కెట్లో కిలో టమాటా రూ.200 పలకడం విశేషం. మదనపల్లె ప్రాంతంలో టమాటా సీజన్ చివరి దశ కావడం, ఇతర ప్రాంతాల్లో దిగుబడి రాకపోవడంతో టమాట ధరకు రెక్కలొచ్చినట్లు తెలుస్తోంది.

Details

రూ.4500 నుంచి 5000 పలికిన టమాటా బాక్సు

మదనపల్లె మార్కెట్ కు శనివారం 253 టన్నుల టమాట మాత్రమే వచ్చినట్లు సమాచారం. మేలి రకమైన టమాటాలకు కిలోకు రూ.160 నుంచి రూ.200 వరకు డబ్బులు చెల్లించి వ్యాపారులు కొంటున్నారు. మార్కెట్లో 25 కిలోల టమాట బాక్స్ ధర రూ. 4500 నుంచి 5వేల వరకు పలికినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి కొత్త పంట వచ్చే వరకు ఈ ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ పంట ఎప్పుడు మార్కెట్‌కు వస్తుందో, ఈ ధరలు ఎప్పుడు తగ్గుతాయో వేచి చూడాల్సిందే.