
Tahawwur Rana: తహవూర్ రాణాకు అత్యున్నత స్థాయి భద్రత: బుల్లెట్ ప్రూఫ్ వాహనం, SWAT కమాండోలు
ఈ వార్తాకథనం ఏంటి
26/11 ముంబయి ఉగ్రదాడుల్లో కీలక నిందితుడు తహవ్వుర్ రాణా కొద్దిసేపట్లో భారత్‌కు రానున్నాడు.
అప్పగింత ప్రక్రియలో భాగంగా అతడిని భారత్‌కు తరలిస్తున్నారు.ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని అనేక ప్రాంతాల్లో భద్రతను గణనీయంగా పెంచారు.
రాణాను జాగ్రత్తగా తరలించేందుకు బుల్లెట్‌ప్రూఫ్ వాహనం ఉపయోగించనున్నారు.
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అతను రాగానే,అక్కడినుంచి అతడిని నేరుగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కేంద్ర కార్యాలయానికి తరలించనున్నారు.
ఈ తరలింపు సమయంలో బుల్లెట్‌ప్రూఫ్ వాహనం వినియోగిస్తారని జాతీయ మీడియా కథనాల్లో వెల్లడైంది.
దీనితోపాటు, అతని భద్రత కోసం కొన్ని సాయుధ వాహనాలను కూడా ఉపయోగించనున్నారు.
ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన స్పెషల్ సెల్‌ను హెచ్చరిక స్థితిలో ఉంచారు, అలాగే విమానాశ్రయం వద్ద SWAT కమాండోలు మోహరించారు.
వివరాలు
6ఏళ్ల తర్వాత భారత్‌కు..
ఈ బుల్లెట్‌ప్రూఫ్ వాహనం కంటే ముందుగా మరొక ప్రత్యేక సాయుధ వాహనం ..మార్క్స్‌మ్యాన్ వాహనాన్ని కూడా సిద్ధంగా ఉంచారు.
ఇది తీవ్రమైన దాడులను కూడా తట్టుకునే సామర్థ్యం కలిగిఉంది.ఇలాంటి హైరిస్క్ నిందితుల రవాణాకు భద్రతా సంస్థలు ఇలాంటి వాహనాలను తరచూ ఉపయోగిస్తుంటాయి.
తహవ్వుర్ రాణా 2009లో అమెరికాలో ఉగ్రవాద కార్యకలాపాల్లో భాగస్వామిగా ఉన్నాడనే ఆరోపణలపై అరెస్టయ్యాడు.
సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం దాదాపు 16ఏళ్ల తర్వాత అతడిని భారత్‌కు తీసుకువస్తున్నారు.
ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టగా,స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నరేందర్ మాన్‌ను నియమించారు.
ముంబయి దాడులకు పాకిస్థాన్ నాయకుల ప్రమేయాన్ని నిరూపించే దిశగా విచారణ సాగనుందని సమాచారం.
దీని ద్వారా పలు కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.