
ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో విషాదం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ సీఎం కుమార్తె, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల పర్యటనలో విషాధం చోటుచేసుకుంది.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జగిత్యాలలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనంలో కవిత శనివారం పాల్గొనేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఆత్మీయ సమ్మేళనంలో షాకింగ్ ఘటన జరిగింది.
కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు నృత్యం చేస్తున్న క్రమంలో కౌన్సిలర్ బండారి రజిని భర్త బండారి నరేందర్ కుప్పకూపిపోయాడు. హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
జగిత్యాల
ఆత్మీయ సమ్మేళనాన్ని రద్దు చేసుకున్న కవిత
బండారి నరేందర్ మృతితో బీఆర్ఎస్ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు. నరేందర్ మృతి చెందిన విషయం తెలుసుకున్న కవిత, దిగ్ర్భాంతికి గురయ్యారు. నరేందర్ మృతికి సంతాపాన్ని తెలిపారు.
నరేందర్ మరణం నేపథ్యంలో ఆత్మీయ సమ్మేళనాన్ని రద్దు చేస్తున్నట్లు కవిత ప్రకటించారు.
అప్పటిదాకా పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచిన తన భర్త ఇక లేడు అన్న విషయం తెలిసిన కౌన్సిలర్ బండారి రజిని రోదనలు మిన్నంటారు.