కింగ్‌ఫిషర్ బీర్ కోసం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మందుబాబు
కొందరి మందుబాబుల సమస్యలు అప్పడప్పుడూ హాస్యాస్పదంగా ఉంటాయి. వాళ్లకు అది సీరియస్ సమస్య అయినా, వేరే వాళ్లకు నవ్వు తెప్పించే విషయం అవుతుంది. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. తమ ప్రాంతలో కింగ్‌ఫిషర్ బీర్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నట్లు సమస్యను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్రం జగిత్యాల నివాసి బీరం రాజేష్ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశాడు. రాజేష్ కింగ్‌ఫిషర్ బీర్ అంటే ఇష్టమట. జగిత్యాల ప్రాంతంలో అతను ఎంత వెతికినా ఆ బ్రాండ్ దొరకపోడవంతో అతడు విసిగిపోయాడు.
లేఖను చదివి అవాక్కయిన కలెక్టర్ సిబ్బంది
బీరు తాగేవారందరి బాధలు తనవే అనుకున్న రాజేష్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని అనుకున్నాడు. జిల్లా కలెక్టర్ చేపట్టిన ప్రజావాణి కార్యక్రమంలో ఈ ప్రాంతంలో కింగ్‌ఫిషర్ బీర్ దొరకడం ఎంత కష్టమో వివరిస్తూ ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను పరిశీలించి జగిత్యాలలో కింగ్‌ఫిషర్ బీర్ అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్‌ను కోరాడు. జగిత్యాలలో అన్ని బ్రాండ్ల బీర్లు, ముఖ్యంగా కింగ్‌ఫిషర్ అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్‌ను కోరారు. ఈ లేఖను చదివిన సిబ్బంది అవాక్కయ్యారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి