తదుపరి వార్తా కథనం

heart attack: హైదరాబాద్‌లో విషాదం.. వేలంలో లడ్డూను దక్కించుకున్న యువకుడు గుండెపోటుతో మృతి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 16, 2024
12:48 pm
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ మణికొండలో గణేష్ శోభాయాత్రలో విషాద ఘటన చోటుచేసుకుంది.
ఆదివారం సాయంత్రం అల్కాపురి కాలనీలో గణేష్ నిమజ్జనోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు.
ఈ వేడుకలో భాగంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్యాంప్రసాద్, లడ్డూ వేలంపాటలో ఉత్సాహంగా పాల్గొన్నాడు.
పోటాపోటీగా జరిగిన ఈ వేలం కార్యక్రమంలో అతను రూ. 15 లక్షలకు లడ్డూను దక్కించుకున్నాడు.
Details
బోరున విలపించిన కుటుంబ సభ్యులు
లడ్డూ కైవసం చేసుకున్న ఆనందంలో శ్యాంప్రసాద్ డాన్స్ చేస్తూ, మురిసిపోయాడు.
ఇంతలో ఇంటికి వెళ్లిన తరువాత అతడు గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే మరణించాడు.
ఈ ఘటనతో అల్కాపురి కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి.
శ్యాంప్రసాద్ ఉత్సాహంగా పాల్గొన్న ఈ వేడుకలో అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం స్థానికులందరిని విషాదంలో ముంచింది.