
Prakasam : ప్రకాశం జిల్లాలో విషాదం.. ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రకాశం జిల్లా దర్శిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈతకెళ్లి ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు గల్లంతయ్యారు.
వీరి కోసం సాగర్ కానెల్‌లో గాలించినా మృతదేహాలు లభ్యం కాలేదు. గత ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలను చేపట్టారు.
వీరిలో ఒకరి మృతదేహం దొరగ్గా, మిగిలిన ఇద్దరి ఆచూకీ దొరకలేదు. ప్రస్తుతం గాలిస్తున్నారు.
మృతులు దర్శి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన లోకేశ్వరరెడ్డి(19), లక్ష్మిపురం గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి(18), కొర్లమడుగు గ్రామానికి చెందిన మణికంఠగా గుర్తించారు.
Details
కేసు నమోదు చేసుకున్న పోలీసులు
దర్శిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కిరణ్ కుమార్ రెడ్డి చదువుతుండగా, నూజివీడు ట్రిపుల్ ఐటీలో మణికంఠ రెడ్డి రెండో సంవత్సరం చదువుతున్నాడు.
ఇక లోకేశ్వరరెడ్డి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ ముగ్గురు కలిసి ఓ వివాహానికి కొత్తపల్లికి వెళ్లారు. అనంతరం సాగర్ బ్రాంచ్ కెనాల్ కి వెళ్లి ఈతకు దిగారు.
లోతు ఎక్కువగా ఉండటంతో ఈ ముగ్గురు గల్లంతయ్యారు. వీరిలో లోకేశ్వర్ రెడ్డి మృతదేహాం లభ్యమైంది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.