Page Loader
Krishna river: శ్రీరామనవమి రోజే విషాదం.. కృష్ణా నదిలో దిగి ముగ్గురు బాలురు మృతి
శ్రీరామనవమి రోజే విషాదం.. కృష్ణా నదిలో దిగి ముగ్గురు బాలురు మృతి

Krishna river: శ్రీరామనవమి రోజే విషాదం.. కృష్ణా నదిలో దిగి ముగ్గురు బాలురు మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 06, 2025
04:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. పండుగ సందర్భంగా కృష్ణా నదిలో స్నానం కోసం దిగిన ముగ్గురు బాలురు గల్లంతై మృతి చెందారు. ఆదివారం ఉదయం మత్తి వెంకట గోపి కిరణ్‌ (15), ఎం. వీరబాబు (15), ఎం. వర్ధన్‌ (16) అనే బాలురు నదిలో స్నానానికి దిగిన తర్వాత తిరిగి బయటకు రాలేదు. ఇది గమనించిన స్థానికులు వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు.

Details

మోదుపూడి గ్రామంలో విషాదచాయలు

అధికారులు స్పందించి, డీఎస్పీ విద్యాశ్రీ నేతృత్వంలో సీఐ యువకుమార్, ఎస్‌ఐ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. కొంతసేపటి తర్వాత ముగ్గురి మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. మృతదేహాలను అనంతరం అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.