
Delivery: దారుణ ఘటన.. ఇంట్లోనే ప్రసవం చేసిన భర్త.. నవజాత శిశువు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక భర్త తన భార్యకు ఇంట్లోనే ప్రసవం చేయించగా, ఆ నవజాత శిశువు ప్రాణాలు కోల్పోయింది. తల్లికి కూడా తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గతంలో కూడా ఇదే విధంగా డెలివరీలు చేసినట్లు ఆ వ్యక్తిపై ఆరోపణలు ఉన్నాయి.
Details
ఘటన వివరాలు
ఇడుక్కి జిల్లా పెరుంకల అనకొంబన్‌కు చెందిన పాస్టర్ చలతర పుతెన్‌వీడు జాన్సన్ సోమవారం తన భార్య విజికి ఇంట్లోనే ప్రసవం చేయించాడు. వైద్య సహాయం తీసుకోకపోవడంతో పసికందు మృతిచెందగా, తల్లికి తీవ్ర రక్తస్రావం సంభవించింది. శిశువు మృతదేహాన్ని ఇడుక్కి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి (MCH) తరలించారు. రక్తస్రావం కారణంగా తల్లినీ అక్కడికే తీసుకెళ్లగా, ఆమె పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై ఇడుక్కి పోలీసులు విచారణ ప్రారంభించారు.
Details
స్థానికుల వాంగ్మూలం
పెరుంకాల వార్డ్ సభ్యుడు అజేష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, విజి గర్భధారణ సమయంలో జంట ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోలేదని వెల్లడించారు. వృత్తిరీత్యా పాస్టర్ అయిన జాన్సన్ పొరుగువారితో పెద్దగా పరిచయం లేకుండా ఉండేవాడని చెప్పారు. అదే కాకుండా, ఈ దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఆ ప్రసవాలను కూడా జాన్సన్ స్వయంగా నిర్వహించాడని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.