తదుపరి వార్తా కథనం
Indian Railway: అనకాపల్లి జిల్లా వద్ద వంతెన కుంగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం.. విశాఖలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 17, 2025
09:57 am
ఈ వార్తాకథనం ఏంటి
అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేట వద్ద వంతెన కుంగిపోవడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
దీంతో గోదావరి, విశాఖ, సింహాద్రి, అమరావతి, గరీబ్‌రథ్, మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు విశాఖపట్నం రైల్వే స్టేషన్ చేరుకోవడం ఆలస్యమవుతోంది.
విశాఖ రైల్వే స్టేషన్‌లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో అధికారులు సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ప్రయాణికులు రైళ్ల సమాచారం కోసం 0891 2746330, 0891 2744619, 87126 41255, 77807 87054 నంబర్లను సంప్రదించాలని సూచించారు.