Puja Khedkar: విచారణ కమిటీకి చెప్తా.. ఎట్టకేలకు మౌనం వీడిన పూజా ఖేద్కర్
వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. సోమవారం కేంద్ర కమిటీ విచారణకు తాను వివరాలు సమర్పించిన తర్వాత నిజం గెలుస్తుందని అన్నారు. ''కమిటీ ముందు సాక్ష్యం చెబుతాను. కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని తాను భావిస్తున్నాను' అని ఖేద్కర్ వాషిమ్‌లో విలేకరులతో అన్నారు. "ఇక్కడ ప్రొబేషనర్‌గా నా పని పని చేయడం చేస్తున్నానని తెలిపారు. కమిటీ ఏమి నివేదిక ఇవ్వనుందో దానికి సంబంధించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని పేర్కొన్నారు.
దిలీప్ ఖేద్కర్ పోల్ అఫిడవిట్‌లో 40 కోట్ల ఆస్తిని చూపారు
ఆమె తండ్రి, దిలీప్ ఖేద్కర్, లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి, తన పోల్ అఫిడవిట్‌లో 40 కోట్ల ఆస్తిని చూపారు. దీంతో పూజ నాన్-క్రీమీ లేయర్ సర్టిఫికేట్‌పై సందేహాలు తలెత్తున్నాయి. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆమె అభ్యర్థిత్వాన్ని పొందేందుకు పూజ సమర్పించిన పత్రాలను పునఃపరిశీలించి, ఆపై ఐఏఎస్ ఎంపిక కోసం కేంద్రం ఏక సభ్య కమిటీని ఏర్పాటు చేసింది. "ప్రభుత్వ నిపుణులు (కమిటీ) నిర్ణయిస్తారు. తాను , మీరు (మీడియా) లేదా ప్రజలు నిర్ణయించలేరు, "అని పూజ అన్నారు. "కమిటీ నిర్ణయం ఎప్పుడు వచ్చినా, అది బహిరంగంగా వుంటుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న విచారణ గురించి మీకు చెప్పే హక్కు నాకు లేదు'' అని ఆమె తెలిపారు.
నేరం రుజువు అయ్యేంత వరకు నిర్దోషులే
నేరం రుజువు అయ్యేంత వరకు మీరు నిర్దోషులు అనే అంశంపైనే భారత రాజ్యాంగం ఆధారపడి ఉందని ఆమె అన్నారు. "కాబట్టి మీడియా విచారణ ద్వారా తనను దోషిగా నిరూపించివద్దని పేర్కొన్నారు.తాను ఏమి సమర్పించాలన్నా దానిని కమిటీ ముందు ఇస్తాను నిజం బయటకు వస్తుంది అని ఖేద్కర్ చెప్పారు. పూణే జిల్లా కలెక్టరేట్‌లో ఆమె ప్రొబేషనరీ పీరియడ్‌లో తన పరిధి దాటి వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో పూజ ఇటీవల పూణే నుండి వాషిమ్‌కు బదిలీ చేశారు. ప్రత్యేక కార్యాలయ స్థలం, అధికారిక వాహనం ,ఇతర డిమాండ్లు ఆమె కోరింది. దీంతో వివాదం చెలరేగింది.