LOADING...
Cyclone Montha: మొంథా తుపాను ప్రభావంతో 107 రైళ్ల రద్దు.. హెల్ప్‌డెస్క్‌ నంబర్లివీ.. 
మొంథా తుపాను ప్రభావంతో 107 రైళ్ల రద్దు.. హెల్ప్‌డెస్క్‌ నంబర్లివీ..

Cyclone Montha: మొంథా తుపాను ప్రభావంతో 107 రైళ్ల రద్దు.. హెల్ప్‌డెస్క్‌ నంబర్లివీ.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2025
03:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

మొంథా తుపాన్ (Cyclone Montha) తీవ్ర ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతాలకు వెళ్ళే అనేక రైళ్లు రద్దు అయ్యాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు మొత్తం 107 రైళ్లు రద్దు చేసినట్లు ప్రకటించారు. అందులో మంగళవారం 70, బుధవారం 36, అలాగే గురువారం ఒక రైలు సేవలను నిలిపివేశారు. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్‌, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్టణం, గుంటూరు, కాకినాడ, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నర్సాపురం, నిడదవోలు, ఒంగోలు, భీమవరం, మాచర్ల వంటి నగరాల నుండి బయల్దేరే పలు రైళ్లను ఈ జాబితాలో చేర్చారు.

వివరాలు 

18 రైళ్ల సమయాల్లో మార్పులు

ఇక ఆరు రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించారు, అలాగే 18 రైళ్ల సమయాల్లో మార్పులు చేసినట్లు అధికారులు వివరించారు. రద్దు చేసిన రైళ్ల పూర్తి వివరాలను రైల్వేశాఖ తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రయాణికులకు రద్దు సమాచారాన్ని ముందుగానే తెలియజేసి, టికెట్‌ మొత్తాన్ని తిరిగి చెల్లించే ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అంతేకాకుండా, విజయవాడ డివిజన్‌లోని ప్రధాన రైల్వేస్టేషన్లలో హెల్ప్‌డెస్క్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి, అని భారతీయ రైల్వే (Indian Railways) ప్రకటించింది.

వివరాలు 

హెల్ప్‌ డెస్క్‌ నంబర్లు 

విజయవాడ- 0866-2575167 నెల్లూరు- 9063347961 ఒంగోలు- 7815909489 బాపట్ల- 7815909329 తెనాలి- 7815909463 ఏలూరు- 7569305268 రాజమహేంద్రవరం- 8331987657 సామర్లకోట- 7382383188 తుని- 7815909479 అనకాపల్లి- 7569305669 భీమవరం- 7815909402 గుడివాడ- 7815909462