LOADING...
MMTS Hyderabad: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. వారం పాటు 16ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
మరో వారం రోజుల పాటు నో సర్వీస్

MMTS Hyderabad: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. వారం పాటు 16ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 09, 2023
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ జారీ చేసింది. ఈ మేరకు వారం పాటు 16సర్వీసులను రద్దు చేస్తూ నిర్ణయించింది. ఈనెల 11 నుంచి 17 వరకు సర్వీసులను పూర్తిగా రద్దు చేసినట్లు ప్రకటించింది. ఉందానగర్ నుంచి లింగంపల్లికి వెళ్లే రైలు నంబర్ 47165 సమయాన్ని మార్చినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సిహెచ్ రాకేష్ వెల్లడించారు. వారం పాటు ఉందానగర్ నుంచి ప్రతిరోజూ ఉదయం 8.50 గంటలకు బయల్దేరుతుందని ప్రకటన చేశారు.రద్దు చేసిన ఎంఎంటీఎస్ సర్వీసుల్లో హైదరాబాద్-లింగంపల్లి మధ్య 10 రైళ్లు ఉన్నాయన్నారు. లింగంపల్లి-ఫలక్‌నుమా మధ్య నడిచే మూడు రైళ్లు, ఉందానగర్-లింగంపల్లి మధ్య నడిచే మూడు రైళ్లను సైతం రద్దు చేశామన్నారు.

DETAILS

బెల్లంపల్లి-బలార్ష సెక్షన్‌ మూడో లైన్లో ముగింపు దశకు పనులు

ఎంఎంటీఎస్ స్టేషన్లలో రద్దైన రైళ్ల సమయాలు, వాటి నంబర్లను ప్రదర్శిస్తామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ పేర్కొన్నారు. మరోవైపు కాజీపేట - బలార్షా సెక్షన్‌లో మూడో లైన్ ఇంటర్‌ లాకింగ్, నాన్ ఇంటర్‌ లాకింగ్ పనులు జరుగుతున్నాయి. దీని కారణంగా ఆగస్ట్ 29 నుంచి సెప్టెంబర్ 26 వరకు ఇంటర్‌సిటీ, భాగ్యనగర్ రైళ్లను బెల్లంపల్లి వరకే నడుస్తాయన్నారు. బెల్లంపల్లి-బలార్ష సెక్షన్‌ మూడో లైన్లో కీలక ముగింపు పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రామగిరి, సింగరేణి, డోర్నకల్ ప్యాసింజర్, కాకతీయ ప్యాసింజర్ రద్దును అక్టోబర్ 2 వరకు పొడిగిస్తున్నామని వివరించారు.