Trains Cancelled: భారీ వర్షాల నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణాల్లో నేడు రద్దయిన రైళ్ల వివరాలివే..
తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు,వరదల ప్రభావం తీవ్రమవుతుండడంతో వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. నేటి రోజులో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అధికారులు సహాయక చర్యలకు సిద్ధమయ్యారు. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు,రైలు పట్టాలు చెరువులుగా మారాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దు అయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే అధికారులు 20కి పైగా రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు.
రద్దైన రైళ్ల వివరాలు..
నంబర్ 07753 ఖాజీపేట్- డోర్నకల్, నంబర్ 07755 డోర్నకల్- విజయవాడ, నంబర్ 07464 విజయవాడ- గుంటూరు, 07465 గుంటూరు- విజయవాడ, 07756 విజయవాడ- డోర్నకల్, నంబర్ 07754 డోర్నకల్- ఖాజీపేట్ రైళ్లు రద్దయ్యాయి. పాక్షికంగా రద్దయినవి.. 17033 భద్రాచలం రోడ్- సిర్పూర్ టౌన్, 17034 సిర్పూర్ టౌన్- భద్రాచలం రోడ్ రైలు పాక్షికంగా రద్దయింది. 5వ తేదీ వరకు ఈ రైలు భద్రాచలం రోడ్- ఖాజీపేట్ మధ్య అందుబాటులో ఉండదు. సిర్పూర్ టౌన్ నుంచి ఖాజీపేట్ మధ్యే రాకపోకలు సాగిస్తుంది.
దారి మళ్లించినవి..
దానాపూర్- ఎస్ఎంవీటీ బెంగళూరు రైలును ఖాజీపేట్, సికింద్రాబాద్, సూలేహళ్లి, గుంతకల్, ధర్మవరం మీదుగా మళ్లించారు. అహ్మదాబాద్- చెన్నై సెంట్రల్ రైలు సూరత్, జల్గావ్, మన్మాడ్, ధౌండ్, వాడి, గుంతకల్, రేణిగుంట మీదుగా, యశ్వంత్‌పూర్- తుగ్లకాబాద్ రైలును ధర్మవరం, గుంతకల్, వాడి, దౌండ్, మన్మాడ్, ఇటార్సీ మీదుగా, పటేల్ నగర్- రాయపురం రైలును ఖాజీపేట్, సికింద్రాబాద్, సూలేహళ్లి, గుంతకల్, రేణిగుంట మీదుగా మళ్లించారు. విజయవాడ మీదుగా.. చెన్నై సెంట్రల్- హౌరా, కడప- విశాఖపట్నం, రామేశ్వరం- భువనేశ్వర్, అలప్పుజ- ధన్‌బాద్, తిరుపతి- కాకినాడ టౌన్ ఎక్స్‌ప్రెస్‌లను విజయవాడ, గుడివాడ, నిడదవోలు మీదుగా మళ్లించారు. విజయవాడ, నిడదవోలు మధ్య ఏ స్టేషన్‌లో కూడా ఆయా రైళ్లకు స్టాపేజీ ఉండదు.
రైళ్ల సమాచారం కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లు
ఏపీకి వెళ్లే రైళ్ల గురించి సమాచారం అందించడానికి ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి ప్రాంతాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ - 27782500, సికింద్రాబాద్ - 27768140, కాజీపేట - 27782660, విజయవాడ - 7569305697, రాజమండ్రి - 08832420541