LOADING...
Earthquake: ఢిల్లీ,హర్యానాలో మరోసారి స్వల్ప భూ ప్రకంపనలు..  
Earthquake: ఢిల్లీ,హర్యానాలో మరోసారి స్వల్ప భూ ప్రకంపనలు..

Earthquake: ఢిల్లీ,హర్యానాలో మరోసారి స్వల్ప భూ ప్రకంపనలు..  

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2025
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో స్వల్ప స్థాయి భూకంపం నమోదైంది.మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌ ప్రాంతంలో 3.2 తీవ్రతతో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఫరీదాబాద్‌లో నమోదైన ఈ భూకంప ప్రభావంతో ఢిల్లీలోనూ భూమి కొద్దిసేపు కంపించింది. భూ అంతర్భాగంలో సుమారు 5కిలోమీటర్ల లోతులో భూ కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ(NCS)తెలిపింది. తెల్లవారుజామున జరిగిన ఈ భూకంపం కారణంగా ప్రజలు భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఇక మరోవైపు,అండమాన్ సముద్రంలో కూడా భూకంపం చోటుచేసుకుంది.సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో అక్కడ భూమి కంపించిందని అధికారులు వెల్లడించారు. ఈ భూకంప తీవ్రత 4.4గానమోదైనట్టు ఎన్‌సీఎస్‌ తెలిపింది.భూ అంతర్భాగంలో 10కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించినట్టు పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఢిల్లీ,హర్యానాలో మరోసారి స్వల్ప భూ ప్రకంపనలు