ఉప ఎన్నికల్లో భాజపా హవా.. మూడు చోట్ల ఆధిక్యం
త్రిపురలోని సెపాహిజాలా జిల్లాలోని ధన్‌పూర్,బోక్సానగర్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను ఎదుర్కోవాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిపక్ష కూటమి ఇండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బోక్సానగర్ స్థానంలో బీజేపీకి చెందిన తఫజ్జల్ హుస్సేన్ గెలుపొందగా,గిరిజనులు అధికంగా ఉండే ధన్‌పూర్‌లో బిందు దేబ్‌నాథ్ విజయం సాధించారు. ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్,ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి,కేరళలోని పుతుపల్లి, పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి, జార్ఖండ్‌లోని డుమ్రీ, త్రిపురలోని బాక్సానగర్, ధన్‌పూర్‌తో సహా ఏడు స్థానాలకు ఈ నెల ప్రారంభంలో ఎన్నికలు జరిగాయి. కేరళ పుతుపల్లి ఉప ఎన్నికలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తరఫున ఊమెన్ కుమారుడు చాందీ ఊమెన్ 36,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పై బీజేపీ ఆధిక్యం
జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలోని డుమ్రీ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఏజేఎస్‌యూ పార్టీకి చెందిన యశోదా దేవి తన సమీప ప్రత్యర్థి జేఎంఎంకు చెందిన బేబీ దేవిపై 1,551 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఉత్తరాఖండ్‌లోని బగేస్‌వర్‌లో, బిజెపికి చెందిన పార్వతి దాస్ తన సమీప అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన బసంత్ కుమార్ పై స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు .నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన చందన్ రామ్ దాస్ ఏప్రిల్‌లో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఘోసి నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ ఆధిక్యం
ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి అసెంబ్లీ నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే ,ప్రముఖ OBC నాయకుడు దారా సింగ్ చౌహాన్ సమాజ్ వాదీ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు.ఆయన రాజీనామాతో ఘోసీలో ఉప ఎన్నిక జరగాల్సి వచ్చింది, తాజా ట్రెండ్‌ల ప్రకారం సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సుధాకర్ సింగ్ దాదాపు 20,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి స్థానంలో బిజెపికి చెందిన తాపసి రాయ్ ప్రస్తుతం అధికార టిఎంసికి చెందిన నిర్మల్ చంద్రరాయ్ కంటే ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. ఎన్నికలు జరిగిన ఏడు స్థానాల్లో ధన్‌పూర్,ద్గుగ్‌పురి,బాగేశ్వర్‌లు బీజేపీకి దక్కాయి.ఘోసీని సమాజ్‌వాదీ పార్టీ చేజిక్కించుకోగా, జార్ఖండ్‌లో జేఎంఎం స్థానం దక్కించుకుంది. త్రిపురలోని బోక్సానగర్ సీటు,కేరళలోని పుతుపల్లి వరుసగా సీపీఎం, కాంగ్రెస్‌తో కలిసి ఉన్నాయి.