
Jaipur: పెట్రోల్ బంక్ వద్ద భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్‌లో ఓ పెట్రోల్ బంక్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సీఎన్‌జీ ట్యాంకర్ లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించింది.
ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు, మరికొందరు గాయపడినట్టు సమాచారం.
జైపూర్ అజ్మీర్ రోడ్‌లోని పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగింది.
మంటలు క్షణాల్లో ట్యాంకర్ నుండి పక్కనున్న వాహనాలకు వ్యాపించి, పలు వాహనాలు మంటల్లో కాలిపోయాయి.
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ టెండర్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు 22 ఫైర్ ఇంజిన్ల సాయంతో ప్రయత్నం చేస్తున్నారు.
అగ్ని ప్రమాదం కారణంగా ఆకాశం నల్లటి పొగలతో కమ్ముకుపోయింది, తద్వారా రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
వివరాలు
ప్రమాద స్థలికి రాజస్థాన్ ముఖ్యమంత్రి
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గాయపడిన వారిని సవాయ్ మాన్‌సింగ్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స కోసం తరలించారు.
మరికొద్దిసేపట్లో రాజస్థాన్ ముఖ్యమంత్రి కూడా ప్రమాద స్థలికి చేరుకోనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అజ్మీర్ రోడ్‌లోని పెట్రోల్ బంక్ ప్రమాదానికి సంబంధించిన వీడియో
जयपुर के अजमेर रोड भांकरोटा स्थित DPS स्कूल के सामने अलसुबह सीएनजी गैंस टैंकर में आग लगने से भीषण हादसा,
— Surendra Gurjar (@S_Gurjar_11) December 20, 2024
कई वाहनों में आग लगने की सूचना. कई लोगों के झुलसने की सूचना.#Jaipur #Rajasthan pic.twitter.com/RjxNYyoNEA