NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Justin Trudeau: ట్రూడో సర్కిల్‌లో ఖలిస్తానీ తీవ్రవాదులు.. హైకమిషనర్‌ సంజయ్‌వర్మ తీవ్ర ఆరోపణలు
    తదుపరి వార్తా కథనం
    Justin Trudeau: ట్రూడో సర్కిల్‌లో ఖలిస్తానీ తీవ్రవాదులు.. హైకమిషనర్‌ సంజయ్‌వర్మ తీవ్ర ఆరోపణలు
    ట్రూడో సర్కిల్‌లో ఖలిస్తానీ తీవ్రవాదులు

    Justin Trudeau: ట్రూడో సర్కిల్‌లో ఖలిస్తానీ తీవ్రవాదులు.. హైకమిషనర్‌ సంజయ్‌వర్మ తీవ్ర ఆరోపణలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 25, 2024
    11:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో సన్నిహిత బృందంలో ఖలిస్థానీ ఉగ్రవాదులు, భారత వ్యతిరేకులు ఉన్నారని అక్కడి హైకమిషనర్‌గా పనిచేసిన సీనియర్‌ దౌత్యాధికారి సంజయ్‌ కుమార్ వర్మ ఆరోపించారు.

    రాజకీయ కారణాలతో ట్రూడో ప్రభుత్వం ఈ ఉగ్రవాదులకు రక్షణ అందిస్తున్నట్లు ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.

    ఈమేరకు ఆయన ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

    వివరాలు 

    2018లో ట్రూడో కుటుంబం ఎనిమిది రోజుల భారత పర్యటన 

    "ట్రూడో సన్నిహితులలో భారత వ్యతిరేక శక్తులు, ఖలిస్థానీ ఉగ్రవాదులు ఉన్నారు. 2018లో ఆయన భారత్ పర్యటనకు వచ్చినప్పుడు, ఖలిస్థానీపై సానుభూతి ఉన్నవారు ఆయన చుట్టూ ఉన్నారు," అని వర్మ వివరించారు.

    2018 ఫిబ్రవరిలో ట్రూడో కుటుంబం ఎనిమిది రోజుల పాటు భారత్‌లో పర్యటించింది. ఆయన గౌరవార్థం కెనడా హైకమిషన్ ఇచ్చిన విందుకు మాజీ ఖలిస్థానీ ఉగ్రవాది జస్పాల్ అత్వాల్‌ను ఆహ్వానించడం దౌత్యపరమైన వివాదానికి దారి తీసింది.

    ఈ ఘటన కారణంగా భారత ప్రభుత్వం ట్రూడో పర్యటనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోవడం, అధికారిక కార్యక్రమాలు తక్కువగా ఉండటం, పర్యాటక ప్రాంతాల సందర్శన మాత్రమే జరిగినట్లు విమర్శలు వచ్చాయి.

    వివరాలు 

    ఖలిస్థానీ ఉగ్రవాది హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం

    "ఖలిస్థానీ గూండాలు నాపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆల్‌బర్టాలో జరిగిన ఒక కార్యక్రమంలో, నా భార్యతో ఉన్న సమయంలో కత్తి దూసుకొచ్చింది. స్థానిక పోలీసులు వారిని అడ్డగించారు," అని వర్మ వెల్లడించారు.

    ''కెనడాలో హైకమిషనర్‌గా నాకు ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు ఉన్నాయి. అక్టోబర్ 12న ఆకస్మిక పరిణామం చోటుచేసుకోవడంతో నాతోపాటు ఆరుగురు దౌత్యవేత్తలు విచారణలో పాల్గొనాలని కెనడా విదేశాంగ శాఖ కోరింది," అని చెప్పారు.

    కెనడా వ్యవహరించిన తీరు భారతదేశానికి వ్యతిరేకంగా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

    ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడిన విషయం తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జస్టిన్ ట్రూడో

    తాజా

    Inter Supplementary : మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం.. ఈ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేయొచ్చు తెలంగాణ
    SCR:ప్రయాణికులకు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే గుడ్ న్యూస్..చ‌ర్ల‌ప‌ల్లి- విశాఖ‌పట్టణం మ‌ధ్య  ప్ర‌త్యేక రైళ్లు  ప్రత్యేక రైళ్లు
    NTR Birthday: ఎన్టీఆర్ బర్త్‌డే గిఫ్ట్‌గా హృతిక్ సర్ప్రైజ్‌..'వార్ 2' నుంచి మాస్ అప్‌డేట్ రెడీ!  జూనియర్ ఎన్టీఆర్
    Hyderabad: హైదరాబాద్‌లో చెరువుల భూములపై భారీ స్థాయిలో ఆక్రమణలు, నిర్మాణాలు.. టీజీఆర్‌ఏసీ నివేదికలో కీలక అంశాలు  హైదరాబాద్

    జస్టిన్ ట్రూడో

    ఖలిస్తానీ హత్య వివాదం.. భారతదేశంలోని కెనడా పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ  కెనడా
    ఐరాసలోనూ కెనడాది పాతపాటే.. భారత పాత్రపై విశ్వాసనీయ సమాచారం ఉందన్న జస్టిన్ ట్రూడో కెనడా
    నిజ్జార్‌ హత్యకు సంబంధించిన సాక్ష్యాలను కొన్ని వారాల క్రితమే భారత్‌తో పంచుకున్నాం: ట్రూడో  ఖలిస్థానీ
    మరో వివాదంలో ట్రూడో.. పార్లమెంట్ సాక్షిగా నాజీలపై ప్రేమ కురిపించిన కెనడా ప్రధాని కెనడా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025