Baba Ramdev: ట్రంప్ ఆర్థిక విధానాలు ప్రమాదకరం.. టారిఫ్ టెర్రరిజం అంటున్న బాబా రామ్‌దేవ్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చేపట్టిన ఆర్థిక విధానాలను పతంజలి సహ వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్ (Baba Ramdev) తీవ్రంగా విమర్శించారు. ట్రంప్ విధానాలను ఆయన 'టారిఫ్ టెర్రరిజం' (Tariff Terrorism) గా పేర్కొంటూ, ఇవే మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలికేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు అసలు యుద్ధం కంటే ప్రమాదకరమైన ఆర్థిక యుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక యుద్ధానికి సరైన సమాధానం ఇవ్వవచ్చు. ట్రంప్ అనుసరిస్తున్న సామ్రాజ్యవాద, విస్తరణవాద ఆర్థిక పోకడలతో పోలిస్తే స్వదేశీ ఉద్యమం ఎంతో ఉన్నతమైనదంని రామ్‌దేవ్ అన్నారు.
Details
ఇది ఆర్థిక యుద్ధమే
సమిష్టిగా దేశాలు ఎదగడానికి సహకారం, సమానాభివృద్ధి అవసరమని ఆయన స్పష్టం చేశారు. అమెరికా విధానాలపై విమర్శిస్తూ 'టారిఫ్ టెర్రరిజం అత్యంత ప్రమాదకరమైంది. మూడో ప్రపంచ యుద్ధం గురించి చెప్పాలంటే.. ఇది ఆర్థిక యుద్ధమే. ఈ పరిస్థితుల్లో కనీసం పేద దేశాలను రక్షించే బాధ్యత అభివృద్ధి చెందిన దేశాలపై ఉంది. కానీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న నాయకులు సామ్రాజ్యవాద ధోరణుల్లో నిమగ్నమైపోతున్నారని రామ్‌దేవ్ పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రపంచంలో అధిక శక్తి, సంపద కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతోందని ఆయన విమర్శించారు.
Details
స్వయం సమృద్ధి సాధించాలి
ప్రతి దేశం, ప్రతి వ్యక్తి తన సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకుని ఎదగాలని సూచించారు. 'స్వదేశీ' నినాదం అంటే ఎవరిపైనా ఆధారపడకుండా, స్వయం సమృద్ధి సాధించడమేనని రామ్‌దేవ్ వివరించారు. బాబా రామ్‌దేవ్ 2006లో ఆచార్య బాలకృష్ణతో కలిసి పతంజలి ఆయుర్వేద్, యోగపీఠాన్ని స్థాపించారు. అనంతరం ఈ సంస్థ ఆయుర్వేద ఔషధాలు, ఆహార పదార్థాలు, సౌందర్య ఉత్పత్తులు వంటి విభాగాల్లో వేగంగా విస్తరించింది. ప్రస్తుతం పతంజలి అమెరికా సహా అనేక దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.