Page Loader
Telangana DSC Results 2024: అలర్ట్.. తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల.. 1:3 నిష్పత్తిలో జిల్లాల వారీగా అభ్యర్థుల మెరిట్ జాబితా
అలర్ట్.. తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల..

Telangana DSC Results 2024: అలర్ట్.. తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల.. 1:3 నిష్పత్తిలో జిల్లాల వారీగా అభ్యర్థుల మెరిట్ జాబితా

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 30, 2024
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ ఫలితాలు వచ్చాయి. తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి డీఎస్సీ ఫలితాలను ఆవిష్కరించారు. ప్రభుత్వం జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం DSC జనరల్ ర్యాంకింగ్ జాబితాలు విడుదల కాగా, రేపు జిల్లాల వారీగా జాబితా అందుబాటులో రానుంది. వచ్చే నెలలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది. తెలంగాణ డీఎస్సీ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ల్లో చూడవచ్చు: https://schooledu.telangana.gov.in/ISMS/ లేదా https://tgdsc.aptonline.in/tgdsc/.

వివరాలు 

రిజర్వేషన్ ప్రకారం 1:3 నిష్పత్తి

అయితే, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కేవలం మార్కులు, ర్యాంక్ మాత్రమే ఉంటాయి. జిల్లాల వారీగా వివరాలు అందించబడతాయి. ఆ తర్వాత, merit cum roster ప్రకారం సెలెక్టెడ్ లిస్టును జిల్లాల వారీగా DEOలకు అందించబడుతుందని అధికారులు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం, సాధారణ ర్యాంకింగ్ జాబితా ఆధారంగా, రిజర్వేషన్ ప్రకారం 1:3 నిష్పత్తిలో జిల్లాల వారీగా అభ్యర్థుల మెరిట్ జాబితా ప్రకటించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 1న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 18 నుంచి ఆగస్ట్ 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఈసారి 2.45 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలకు హాజరయ్యారు.

వివరాలు 

 సెప్టెంబర్ 6న ఫైనల్ కీ 

పరీక్షలు ముగిసిన 56 రోజుల్లోనే ఫలితాలను ప్రకటించడం ద్వారా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రికార్డును నెలకొల్పింది. తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 2,45,263 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు, ఆగస్టు 13న రాష్ట్ర విద్యాశాఖ ప్రిలిమినరీ కీని విడుదల చేసింది. ప్రిలిమినరీ కీపై ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు స్వీకరించబడగా, సెప్టెంబర్ 6న ఫైనల్ కీ విడుదల చేయబడింది. మొత్తం పోస్టులు: 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 727 భాషా పండితులు 182 పీఈటీలు 6,508 ఎస్జీటీలు ప్రత్యేక విద్య కోసం 220 స్కూల్ అసిస్టెంట్లు 796 ఎస్జీటీ పోస్టులు ఈ పోస్టులను అభ్యర్థుల మెరిట్ మరియు రిజర్వేషన్ ఆధారంగా భర్తీ చేయనున్నారు.