
Inter : తెలంగాణ ఇంటర్ బోర్డు 2025-26 అకడమిక్ క్యాలెండర్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జూనియర్ కళాశాలల అకడమిక్ క్యాలెండర్‌ను ఏప్రిల్ 3న విడుదల చేసింది. ఈ క్యాలెండర్‌లో తరగతుల ప్రారంభం, సెలవులు, పరీక్షల తేదీలు వంటి వివరాలు ప్రకటించబడ్డాయి. బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ప్రకటించిన ప్రకారం, ఈ విద్యాసంవత్సరానికి మొత్తం 226 పని దినాలను గుర్తించారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 2, 2025 నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం తరగతులు మొదలుకానున్నాయి. విద్యా సంవత్సరం చివరి పని దినాన్ని 2026 మార్చి 31గా నిర్ణయించారు.
వివరాలు
పండుగ సెలవులు
దసరా సెలవులు: సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 5, 2025 వరకు. అక్టోబర్ 6న మళ్లీ తరగతులు ప్రారంభమవుతాయి. సంక్రాంతి సెలవులు: 2026 జనవరి 11 నుండి 18 వరకు. ముఖ్యమైన పరీక్షల వివరాలు: అర్థ సంవత్సర పరీక్షలు: 2025 నవంబర్ 10 నుండి 15 వరకు. ప్రీ-ఫైనల్ పరీక్షలు: 2026 జనవరి 19 నుండి 24 వరకు. ప్రాక్టికల్ పరీక్షలు: 2026 ఫిబ్రవరి మొదటి వారంలో. వార్షిక పరీక్షలు: 2026 మార్చి మొదటి వారంలో నిర్వహించనున్నారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు: 2026 మే చివరి వారంలో.
వివరాలు
వేసవి సెలవులు
2026 ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం 2026 జూన్ 1న జూనియర్ కళాశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ ముఖ్య తేదీలు: తరగతుల ప్రారంభం: 02.06.2025 అర్థ సంవత్సర పరీక్షలు: 10.11.2025 - 15.11.2025 సంక్రాంతి సెలవులు: 11.01.2026 - 18.01.2026 ప్రీ ఫైనల్ పరీక్షలు: 19.01.2026 - 24.01.2026 ప్రాక్టికల్స్: ఫిబ్రవరి మొదటి వారంలో వార్షిక పరీక్షలు: మార్చి మొదటి వారంలో చివరి పని దినం: 31.03.2026 వేసవి సెలవులు: 01.04.2026 - 31.05.2026 జూనియర్ కళాశాలలు పునఃప్రారంభం: 01.06.2026 అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు: మే చివరి వారంలో
వివరాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ విధానంలో మార్పులు
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ బోర్డు 2025-26 విద్యా సంవత్సరంలో సిలబస్, ప్రశ్నపత్రాల నమూనాల్లో కీలక మార్పులు చేసింది. మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలలో తొలిసారి ఒక మార్కు ప్రశ్నలు ప్రవేశపెడుతున్నారు. ఈ మార్పులకు సంబంధించిన సమాచారాన్ని బోర్డు అన్ని జూనియర్ కళాశాలలకు పంపింది. ఇంతకుముందు పదోతరగతిలో ప్రవేశపెట్టిన ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ను ఇప్పుడు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి కూడా వర్తింపజేశారు. గతంలో మార్చి 20వ తేదీతో ఆంధ్రప్రదేశ్ ఇంటర్ వార్షిక పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే.