TGSRTC: ఆ మార్గంలో ప్రయాణించేవారికి శుభవార్త ప్రకటించిన టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టానికి గురయ్యాయి.
జాతీయ రహదారులు కొట్టుకు పోవడంతో,ఈ రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయి, ప్రయాణికులు కష్టాలకు లోనయ్యారు.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, తెలంగాణ ఆర్టీసీ (టీజీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్- విజయవాడ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు 10% రాయితీని అందిస్తున్నట్లు, టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు.
ఈ రాయితీ అన్ని ఏసీ, రాజధాని, సూపర్ లగ్జరీ బస్సులకు వర్తిస్తుందని, ముందస్తు రిజర్వేషన్స్ కోసం ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ https://www.tgsrtcbus.in ను ఉపయోగించాలని అధికారులు సూచించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సజ్జనార్ చేసిన ట్వీట్
హైదరాబాద్-విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ఆ రూట్ లో రాకపోకలు సాగించే వారి కోసం టికెట్ ధరలో 10 శాతం రాయితీని #TGSRTC కల్పిస్తోంది. రాజధాని ఏసీ, సూపర్ లగ్జరీ బస్సులలో ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది.… pic.twitter.com/2vE6Z9e6Xb
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) September 4, 2024