Page Loader
TSRTC: ప్రయాణికుల కోసం రెండు స్పెషల్ ఆఫర్స్‌ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ
ప్రయాణికుల కోసం రెండు స్పెషల్ ఆఫర్స్‌ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ

TSRTC: ప్రయాణికుల కోసం రెండు స్పెషల్ ఆఫర్స్‌ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ

వ్రాసిన వారు Stalin
Mar 09, 2023
05:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్‌టీసీ) రెండు ప్రత్యేకమైన ఆఫర్లను గురువారం లాంఛ్ చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రయాణికులకు సరసమైన ధరలో, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది. మొదటి ఆఫర్ టీ-6 టికెట్.. ఇది మహిళలు, సీనియర్ సిటిజన్లకు అందుబాటులో ఉంది. ఈ టికెట్ హైదరాబాద్ సబర్బన్ పరిమితుల్లో సిటీ ఆర్డినరీ,మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణించే తక్కువ ధరకే ప్రయాణించొచ్చు. వీరికి టికెట్ ధరలో రాయితీ లభిస్తుంది. టీ-6 టికెట్ ధర సాధారణ ఛార్జీల కంటే చాలా తక్కువ. కేవలం రూ.50 మాత్రమే.

ఆర్టీసీ

గతంలో ప్రవేశపెట్టిన టి-24 టికెట్‌ విశేష స్పందన

రెండో ఆఫర్ ఎఫ్-24 టికెట్.. ఇది కలిసి ప్రయాణించాలనుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. కుటుంబం, స్నేహితుల సమూహాల కోసం దీన్ని తీసుకొస్తున్నట్లు టీఎస్ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ టిక్కెట్ ధర రూ.300 ఉంటుంది. హైదరాబాద్ సబర్బన్ పరిమితుల్లో వారాంతాల్లో, ప్రభుత్వ సెలవు దినాల్లో నాలుగు బృందాలుగా ప్రయాణించాలనుకునే వారికి ఇది సరైనది. ఎఫ్-24 టిక్కెట్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి 24 గంటల పాటు సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించవచ్చు. గతంలో ప్రవేశపెట్టిన టి-24 టికెట్‌కు ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన లభించిందని, దాని స్ఫూర్తితోనే ఈ రెండు కొత్త ఆఫర్లను తీసుకొచ్చినట్లు సజ్జనార్ వెల్లడించారు.