TTD: టీటీడీ మరో కీలక నిర్ణయం.. తిరుమల అన్నప్రసాదంలో కొత్త మెను
ఈ వార్తాకథనం ఏంటి
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త అందింది. త్వరలో అన్నప్రసాదంలో కొత్త వంటకం చేరనుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మసాలా వడలను అన్నప్రసాదంలో అందించేందుకు నిర్ణయం తీసుకుంది.
మార్చి 6 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఇప్పటికే జనవరిలో ప్రయోగాత్మకంగా 5,000 మంది భక్తులకు వడలను వడ్డించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
Details
మార్చి 6న అధికారికంగా ప్రారంభం
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు మసాలా వడలను వడ్డించే కార్యక్రమాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
జనవరిలో జరిగిన ట్రయల్ రన్‌లో 50,000 మంది భక్తులకు ఉల్లిపాయలు, వెల్లులి లేకుండా తయారు చేసిన వడలను వడ్డించారు.
భక్తుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ కొత్త ఐటమ్‌ను ప్రతిరోజూ అందించాలనే నిర్ణయానికి టీటీడీ వచ్చింది.
Details
వడల తయారీకి సిబ్బంది కొరత
అన్నప్రసాదంలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వడల తయారీ కోసం అధిక సిబ్బంది అవసరమవుతోంది. ప్రస్తుతం కొన్ని లోటుపాట్లు ఉన్నా మార్చి 6 నాటికి వీటిని సరిచేసి కొత్త మెనూను అమలు చేయనున్నారు.
టీటీడీ మరో నిర్ణయం
అంతేకాకుండా తిరుమలలో నీటి బాటిళ్ల స్థానంలో టెట్రా ప్యాకెట్లను ప్రవేశపెట్టేందుకు టీటీడీ యోచిస్తోంది.
ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు సమాచారం.