
#Telangana: తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో పోలీసుల సోదాలు.. సీఎం కేసీఆరే బచ్చా, నువ్వెంత అంటున్న కాంగ్రెస్ అభ్యర్థి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో హై-ఓల్టేజీ రాజకీయం నడుస్తోంది.ప్రధాన ప్రతిపక్షంగా ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ నేతలపై పోలీసులు, ఐటీ అధికారులు రైడ్లు చేస్తున్నారు.
ఇప్పటికే మహేశ్వరం నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు పారిజాత నర్సింహరెడ్డి సహా కేఎల్ఆర్ నివాసాల్లో ఐటీ రైడ్స్ జరిగాయి.
తాజాగా ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది.
పోలీసులతో పాటు కొందరు రెవెన్యూ అధికారులు కూడా ఈ సోదాల్లో పాల్గొన్నారు.ఖమ్మం గ్రామీణ మండలంలోని శ్రీసిటీలోని తుమ్మల నివాసంలో ఈ సోదాలు జరిగడం గమనార్హం.
మరోవైపు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఉదయమే తన నివాసం నుంచి తుమ్మల బయటకు వెళ్లిపోయారు.
ఈ క్రమంలోనే పోలీసులు తుమ్మల ఇంట్లోకి వచ్చిన సమయంలో తుమ్మల భార్య, కొందరు అనుచరులు ఉన్నారు.
details
మంత్రి పువ్వాడకు ఓటమి ఖారారైంది : తుమ్మల
అయినప్పటికీ తుమ్మల నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మేరకు పలు పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
అయితే మంత్రి పువ్వాడకు ఓటమి ఖారారైందని తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.
సీఎం కేసీఆర్ లాంటి వాడే తన ముందు బచ్చా అన్న తుమ్మల, ఇక మంత్రి అజయ్ స్థాయి ఏంటో అర్ధం చేసుకోవాలని చురకలు అంటించారు.
అజయ్ డిపాజిట్ కోసం ప్రయత్నం చేసుకోవాలని, ఇలాంటి ప్రయత్నాలతో తుమ్మల కాదు కదా తుమ్మల కార్యకర్త కూడా బెదరడన్నారు.
పోలీసుల సోదాలను ఖమ్మం కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా తప్పుబట్టాయి. బీఆర్ఎస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఎన్నికల సమయంలో రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని దుయ్యబడుతున్నాయి.