Floods : వరదలకు కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.. ప్రజలకు హెచ్చరికలు జారీ
కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ గేటు వరదలకు కొట్టుకుపోయింది. శనివారం రాత్రి హోస్పేట వద్ద చైన్ లింక్ తెగడంతో 19వ గేట్ కొట్టుకుపోయింది. దీంతో ముందు జాగ్రత్తలో భాగంగా అధికారులు అన్ని గేట్లు ఎత్తేశారు. ఇప్పటివరకూ లక్ష క్యూసెక్కుల మేర నీరు వృథాగా పోతోంది. కర్ణాటక మంత్రి శివరాజ్ అక్కడి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. షియోగలో భారీ వర్షాల కారణంగా తుంగభద్ర డ్యామ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇవాళ నిపుణుల బృందం అక్కడికి చేరుకొని డ్యామ్‌ను పరిశీలించనున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అదేశాలు జారీ చేశారు. ఈ గేటు కొట్టుకుపోవడంతో కర్నూలు జిల్లాలోని పలు మండలాలకు హెచ్చరీకలు జారీ చేశారు. కౌతాళం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతం వరద ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. తుంగభద్రలో వరద తగ్గాక అధికారులు మరమ్మతులు చేపట్టే అవకాశం ఉంది.