హస్తం గూటికే జూపల్లి, పొంగులేటి - నెలాఖరులోగా చేరికలకు ముహూర్తం
చానాళ్లుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ కీలక పొలిటికల్ డెసిషన్ కు వచ్చారని తెలుస్తోంది. తమ అనుచరగణం, వివిధ వర్గాల ప్రజలు, స్నేహితులు, అభిమానులతో సుదీర్ఘంగా చర్చించిన ఈ ఇద్దరు నేతలు, ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు దాదాపుగా సన్నద్ధమైనట్లు సమాచారం. తమతో ఉన్న అనుచరులకు పార్టీ టికెట్లు కేటాయిస్తే చేరేందుకు రెఢీగా ఉన్నామని కాంగ్రెస్ అధిష్ఠానంతో గత కొద్ది రోజులుగా ఇరువురు నాయకుల చర్చిస్తున్నారు. కన్నడ ఫలితాలతో స్టోరీ రివర్స్ టీపీసీసీలో న్యూ జాయినింగ్స్ జోష్ తెప్పిస్తోంది. కర్ణాటకలో వచ్చిన ఫలితాల తర్వాత ఆ పార్టీపై ఈ ఇద్దరు బిగ్ లీడర్స్ సానుకూలంగానే ఉన్నారని తెలుస్తోంది.
అనుచరులకు ఎమ్మెల్యే టికెట్లకు హైకమాండ్ ఓకే
సుదీర్ఘ మంతనాల అనంతరం దిల్లీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అర్థమవుతోంది. జూన్ నెలాఖరులో కండువా మార్పు... ఈ నెల 3వ వారం లేదా నెలాఖరు వరకు జూపల్లి, పొంగులేటి చేరికలు ఉంటాయని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో భాగంగా అమెరికాలో ఉన్నారు. ఆయన స్వదేశం వచ్చాక ఓ డేట్ ఫిక్స్ చేసుకుని రాహుల్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు సమాచారం. అనంతరం ఖమ్మం గడ్డపై ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారని వినికిడి.