Page Loader
Telangana: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు.. పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు.. పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు

Telangana: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు.. పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు

వ్రాసిన వారు Stalin
Jun 01, 2024
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా ట్యాంక్‌బండ్, పరేడ్ గ్రౌండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.ట్యాంక్‌బండ్‌పై శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి 12 గంటల వరకు, గన్‌పార్క్ వద్ద ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. అదేవిధంగా ఆదివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో వాహనాల రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.రాష్ట్రావతరణ వేడుకల సందర్భంగా ట్యాంక్‌బండ్‌,పరేడ్‌గ్రౌండ్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని సీపీ కె.శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Details

ట్యాంక్‌ బండ్‌ పరిసరాల్లో.. 

అప్పర్‌ ట్యాంక్‌బండ్‌పై శనివారం ఉదయం 6 గంటల నుంచి జూన్‌ 2 రాత్రి 12 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలుంటాయి. నల్లగుట్ట జంక్షన్‌ నుంచి నెక్లెస్‌ రోటరీ వైపునకు వచ్చేవాహనాలను రాణిగంజ్‌ వైపునకు మళ్లిస్తారు. రాణిగంజ్‌ నుంచి నెక్లెస్‌ రోటరీ వైపునకు వచ్చే వాహనాలను మినిస్టర్‌ రోడ్‌ వైపునకు మళ్లిస్తారు. వీవీ స్టాచ్యూ వైపు నుంచి నెక్లెస్‌ రోటరీ వైపునకు వచ్చే వాహనాలను నల్లగుట్ట వైపు నకు పంపుతారు. పాత సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ వైపునుంచి వచ్చేవాహనాలను రవీంద్రభారతి వైపునకు మళ్లిస్తారు.

Details

బండమైసమ్మ క్రాస్‌రోడ్‌ ..

ఇక్బాల్‌ మినార్‌ వైపునుంచి వచ్చే వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీదుగా స్టీల్‌బ్రిడ్జి వైపున కు పంపుతారు. లిబర్టీ, బషీర్‌బాగ్‌ వైపునుంచి వచ్చేవాహనాలను అంబేడ్కర్‌ విగ్రహం నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వైపునకు మళ్లిస్తారు. బండమైసమ్మ క్రాస్‌రోడ్‌ నుంచి వచ్చేవాహనాలను ఇందిరాపార్క్‌ వైపునకు పంపుతారు. కవాడిగూడ వైపునుంచి వచ్చేవాహనాలను బైబిల్‌ హౌస్‌, డీబీఆర్‌ మిల్స్‌ వైపునకు పంపుతారని ఆ ప్రకటనలో తెలిపారు.