IndiGo flights: ముంబై నుంచి పశ్చిమాసియాకు వెళ్తున్న.. రెండు ఇండిగో విమానాలకు బెదిరింపులు`
ఈ వార్తాకథనం ఏంటి
ఎయిర్ ఇండియా విమానం తర్వాత ఇండిగోకు చెందిన మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
ముంబై నుంచి మస్కట్‌కు, జెడ్డాకు వెళ్లాల్సిన ఫ్లైట్లకు ఈ బెదిరింపులు వచ్చాయని దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో ప్రతినిధి తెలిపారు.
ముంబై నుంచి మస్కట్‌కు వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ 6ఈ 1275కి బాంబు బెదిరింపు వచ్చింది.
ప్రోటోకాల్ ప్రకారం, ఈ విమానాన్ని దూరంగా ఉండే ఒక బే ప్రాంతానికి తీసుకెళ్లారు. నిర్వహణ విధానంలోని నిబంధనల ప్రకారం భద్రతా తనిఖీలు వెంటనే ప్రారంభమయ్యాయి.
వివరాలు
ఇండిగో ఫ్లైట్ 6E56కు కూడా బాంబు బెదిరింపు
మరో ముంబై నుంచి జెడ్డా వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ 6E56కు కూడా బాంబు బెదిరింపు వచ్చినట్లు వెల్లడించారు.
ఇక, సోమవారం ఉదయం ముంబై-న్యూయార్క్ వెళ్లాల్సిన విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చిందని తెలిసింది.
ఈ నేపథ్యంలో, ఈ విమానాన్ని ఢిల్లీకి మళ్లించారు. 239 మంది ప్రయాణీకులతో ఉన్న ఈ విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో భద్రంగా ల్యాండింగ్ చేశారు.
ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే రెండు ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు రావడం గమనార్హం.