తదుపరి వార్తా కథనం
Manipur-Terrorists Attack: మణిపూర్ లో భద్రతా బలగాలపై దాడి..ఇద్దరు మృతి..మరో ఇద్దరికి గాయాలు
వ్రాసిన వారు
Stalin
Apr 27, 2024
11:07 am
ఈ వార్తాకథనం ఏంటి
మణిపూర్(Manipur)లో భారత భద్రతా బలగాలపై ఉగ్రవాదులు దాడి(Terrorists Attack)కి తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు ఇద్దరు సైనికులు మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు.
శనివారం తెల్లవారుజామున బిష్ణుపూర్ జిల్లాలోని నరన్‌సేన ప్రాంతంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్ పీఎఫ్) (CRPF)128 వ బెటాలియన్ కు చెందిన సైనికులపై ఉగ్రవాదులు దాడి చేశారు.
భద్రతా దళాల అవుట్ పోస్ట్ లోప బాంబులు విసిరడంతో పాటు ఎత్తైన కొండపై నుంచి కాల్పులకు తెగబడ్డారు.
దీంతో ఇద్దరు సైనికులు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
మరణించినవారిని సీఆర్ ఫీఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎన్ సర్కార్, హెడ్ కానిస్టేబుల్ అరూప్ సైనీగా గుర్తించారు.
గాయపడిన సైనికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.