రెండు ప్రైవేట్ బస్సులు ఢీ.. ఆరుగురు దుర్మరణం.. 20మందికి పైగా!
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. 20మందికి తీవ్ర గాయాలు కాగా, మరో 32 మందికి స్వల్ప గాయాలయ్యాయి. అమర్ నాథ్ యాత్రకు వెళ్లి హింగోలి జిల్లాకు తిరిగి వస్తున్న వస్తున్న బస్సు, నాసిక్ వైపుగా వెళ్తున్న మరో బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మల్కాపూర్ ప్రాంతంలోని నందూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని గురద్వారాలో ఓ ఆస్పత్రికి తరలించారు. నాసిక్ వైపు వెళ్తున్న బస్సు ట్రక్కును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించి, రెండో బస్సుకు ఎదురుగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. వెంటనే పోలీసులకు ట్రాఫిక్ ను క్లియర్ ను చేశారు. బస్సు ను రోడ్డుపై నుంచి తొలగించి ప్రయాణికులకు అంతరాయం లేకుండా చేశామని పోలీసులు తెలిపారు. అమర్ నాథ్ యాత్ర నుంచి బస్సు బాలాజీ ట్రావెల్స్ కు చెందినది కాగా, నాసిక్ వైపు వెళ్తున్న బస్సు రాయల్ ట్రావెల్స్ కు చెందినదని పోలీసులు వెల్లడించారు.