ఆమె గిరిజన, వితంతువు కాబట్టి రాష్ట్రపతిని కొత్త పార్లమెంటుకు ఆహ్వానించలేదు: ఉదయనిధి స్టాలిన్
తమిళనాడు మంత్రి, డీఎంకే యువ నేత ఉదయనిధి స్టాలిన్ మదురైలో జరిగిన ఓ కార్యక్రమంలో సనాతన ధర్మంపై మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించకపోవడంపై తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ బుధవారం ప్రశ్నలు సంధించారు. ప్రెసిడెంట్ ముర్ము వితంతువు కావడం,గిరిజన సమాజానికి చెందిన వారు కావడం వల్లనే ఆమె గైర్హాజరయ్యారని ఆయన అన్నారు. దీనినే సనాతన ధర్మం అంటున్నాం అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. దాదాపు 800 కోట్ల రూపాయలతో నిర్మించిన కొత్త పార్లమెంటు భవనం ప్రారంభానికి కూడా రాష్ట్రపతి ముర్ము కి ఆహ్వానం అందలేదని ఉదయనిధి అన్నారు.
సనాతన ధర్మం నిర్మూలనకే డీఎంకే పుట్టింది
అంతేకాకుండా, మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు కూడా హిందీ నటీమణులను ఆహ్వానించారని, ఆమె వ్యక్తిగత పరిస్థితుల కారణంగా రాష్ట్రపతిని మినహాయించారని ఉదయనిధి స్టాలిన్ ఎత్తి చూపారు. ఇలాంటి నిర్ణయాలపై 'సనాతన ధర్మం' ప్రభావం ఎలా ఉంటుందో ఈ ఘటనలు సూచిస్తున్నాయని పేర్కొన్నారు. 'సనాతన ధర్మం'పై తన తొలి వ్యాఖ్యల తర్వాత తలెత్తిన వివాదం గురించి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, "ప్రజలు నా తలకు రేటు ఫిక్స్ చేసారు, నేను అలాంటి వాటి గురించి ఎప్పటికీ బాధపడను, సనాతన ధర్మాన్ని నిర్మూలించే వరకు డిఎంకె పుట్టిందని.. తమ లక్ష్యం పూర్తయ్యే వరకు విశ్రమించమని ఆయన అన్నారు.