
UGC: నకిలీ యూనివర్సిటీల జాబితాను విడుదల చేసిన యూజీసీ.. ఏపీలో ఎన్ని ఉన్నాయంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఉన్నత విద్యా ప్రమాణాలను పర్యవేక్షించే రెగ్యులేటరీ అథారిటీ అయిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC).. దేశంలోని నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాను బుధవారం విడుదల చేసింది.
యూజీసీ విడుదల చేసిన జాబితాలో 20 మోసపూరిత విద్యా సంస్థలు ఉన్నాయి. వీటిలో దిల్లీలోనే అత్యధికంగా 8 ఫేక్ యూనివర్సిటీలు ఉన్నట్లు యూజీసీ తెలిపింది.
ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌తో సహా వివిధ రాష్ట్రాలకు చెందిన విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.
విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నకిలీ యూనివర్సిటీల గురించి అవగాహన కల్పించేందుకే ఈ జాబితాను విడుదల చేసినట్లు యూజీసీ వెల్లడించింది.
యూనివర్సిటీ
నకిలీ విశ్వవిద్యాలయాల జాబితా ఇదే..
దిల్లీలో..
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ & ఫిజికల్ హెల్త్ సైన్సెస్ (ఏఐఐపీహెచ్ఎస్)విశ్వవిద్యాలయం
కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్
ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం
ఒకేషనల్ యూనివర్సిటీ
ఏడీఆర్-సెంట్రిక్ జురిడికల్ యూనివర్సిటీ
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్
విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ
ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం
ఉత్తర్‌ప్రదేశ్‌లో..
గాంధీ హిందీ విద్యాపీఠం
నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి
నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ (ఓపెన్ యూనివర్సిటీ)
భారతీయ శిక్షా పరిషత్
పశ్చిమ బెంగాల్‌లో..
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ఇ
న్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్
యూనివర్సిటీ
ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఫేక్ యూనివర్సిటీలు
ఆంధ్రప్రదేశ్‌లో..
క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ
బైబిల్ ఓపెన్ యూనివర్శిటీ ఆఫ్ ఇండియా
కర్ణాటకలో..
బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ
కేరళలో..
సెయింట్ జాన్స్ విశ్వవిద్యాలయం
మహారాష్ట్రలో..
రాజా అరబిక్ విశ్వవిద్యాలయం
పుదుచ్చేరిలో..
శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్
ఈ జాబితాను విడుదల చేసిన సందర్భంగా ఆయా నకిలీ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్‌లకు యూజీసీ కార్యదర్శి మనీష్ జోషి ఇలా లేఖలు రాశారు. మీ సంస్థ నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాలో ఉందని మీకు తెలియజేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.