LOADING...
Delhi riots case: 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

Delhi riots case: 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 05, 2026
11:35 am

ఈ వార్తాకథనం ఏంటి

2020లో ఈశాన్య దిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించి నమోదైన పెద్ద కుట్ర కేసులో ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. అయితే ఇదే కేసులో గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రెహ్మాన్, షాదాబ్ అహ్మద్, మొహమ్మద్ సలీం ఖాన్‌లకు బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తులు అరవింద్ కుమార్, ఎన్‌వీ అంజారియా ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌లో ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సెప్టెంబర్ 22న అత్యున్నత న్యాయస్థానం పోలీసులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం అన్ని పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు డిసెంబర్ 10న తీర్పును రిజర్వ్ చేసింది.

వివరాలు 

ఐదేళ్లకు పైగా జైలులో ఉన్నా తమ క్లయింట్లపై హింస

ఈ కేసులో నిందితులు అల్లర్లకు పెద్ద కుట్ర పన్నారని ఆరోపణలు ఉన్నాయి.ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ ఈ అంశంపై ఐపీసీతో పాటు యూఏపీఏ కింద కేసులు నమోదు చేసింది. ఈ కేసులో ఉన్న చాలామంది నిందితులు 2020 నుంచే జైలులో ఉన్నారు. విచారణ సమయంలో నిందితుల తరపు న్యాయవాదులు ట్రయల్ ప్రారంభం కావడంలో తీవ్ర ఆలస్యం జరుగుతోందని, ఐదేళ్లకు పైగా జైలులో ఉన్నా తమ క్లయింట్లపై హింసకు ప్రేరేపించినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని వాదించారు. అందుకే బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు.అయితే ఢిల్లీ పోలీసులు ఈ బెయిల్ పిటిషన్లను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇవి యాదృచ్ఛిక నిరసనలు కావని,దేశవ్యాప్తంగా "ప్రభుత్వ మార్పు", "ఆర్థిక అస్తవ్యస్తత" లక్ష్యంగా రూపొందించిన పెద్ద కుట్రలో భాగమని వాదించారు.

వివరాలు 

53 మంది మృతి.. ప్రభుత్వ ఆస్తి నష్టం

అంతేకాదు, అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సమయంలోనే ఈ కుట్రను అమలు చేయాలని ప్లాన్ చేశారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించి, పౌరసత్వ సవరణ చట్టం (CAA) అంశాన్ని గ్లోబల్‌గా తీసుకెళ్లడమే ఉద్దేశమని చెప్పారు. ఈ ముందస్తు ప్రణాళికతో చేసిన కుట్ర వల్ల 53 మంది మృతి చెందారని,భారీగా ప్రభుత్వ ఆస్తి నష్టం జరిగిందని,ఢిల్లీలో మాత్రమే 753 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయని ప్రాసిక్యూషన్ పేర్కొంది.

Advertisement

వివరాలు 

మరో నిందితుడి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరణ 

ఇదివరకే సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌తో పాటు మరో ఏడుగురికి బెయిల్ నిరాకరించింది. మతపరమైన రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా పెద్ద ఎత్తున ముస్లింలను సమీకరించేందుకు ప్రయత్నించారని, కుట్రలో వారి పాత్ర తీవ్రంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అదే రోజు మరో నిందితుడి బెయిల్ పిటిషన్‌ను వేరే హైకోర్టు ధర్మాసనం కూడా తిరస్కరించింది.

Advertisement