Page Loader
Bihar: పేక మేడల్లా కూలుతోన్న వంతెనలు.. వారం వ్యవధిలో మూడోది
Bihar: పేక మేడల్లా కూలుతోన్న వంతెనలు.. వారం వ్యవధిలో మూడోది

Bihar: పేక మేడల్లా కూలుతోన్న వంతెనలు.. వారం వ్యవధిలో మూడోది

వ్రాసిన వారు Stalin
Jun 23, 2024
03:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లో రోజుకో వంతెన కుప్పకూలుతున్నాయి. ఇప్పటికే వారం వ్యవధిలోనే మూడు వంతెనలు కూలిపోయాయి. అరారియా, సివాన్ తర్వాత ఇప్పుడు మోతిహారిలో మరో వంతెన కూలిపోయింది. మోతీహరిలోని ఘోరసహన్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన నేటి తెల్ల‌వారుఝామున కూలిపోయింది. ఈ వంతెనపై ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. రూ.1.5 కోట్లతో ఈ వంతెనను నిర్మిస్తున్నారు.ఈ వంతెన దాదాపు నిర్మాణం పూర్తయింది. అంవా నుండి చైన్‌పూర్ స్టేషన్‌కు వెళ్లే రహదారిపై ఈ వంతెనను నిర్మిస్తున్నారు. అరారియాలోని బక్రా నదిపై 12 కోట్ల రూపాయలతో నిర్మించిన వంతెన జూన్ 18న కుప్పకూలింది. జూన్ 22న సివాన్‌లోని గండక్ కెనాల్‌పై వంతెన కూలిపోయింది.

వివరాలు 

అర్ధ‌రాత్రి కూలిన వంతెన 

దాదాపు 40 అడుగుల విస్తీర్ణంలో ఈ వంతెనను నిర్మించనున్నట్లు సమాచారం.వంతెన కోసం కాస్టింగ్ రాత్రి చీకటిలో జరుగుతోంది. అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత ఒక్క‌సారిగా ఈ వంతెన కూలిపోయింది. సిమెంట్, ఇసుక సరిగ్గా సరిపోకపోవడం, కాస్టింగ్ కోసం ఏర్పాటు చేసిన సెంట్రింగ్ పైపు బలహీనంగా ఉండడంతో వంతెన కూలిపోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

వివరాలు 

బ్రిడ్జినిర్మాణం డబ్బుల సంపాదన కోసమా లేక ప్రజల కోసమా? 

రాష్ట్రంలో నిత్యం బ్రిడ్జిలు కూలిపోతుండడంతో బ్రిడ్జిని డబ్బుల సంపాదించడం కోసం నిర్మిస్తున్నారా.. లేక నిజంగానే ప్రజల సౌకర్యార్థం బ్రిడ్జి నిర్మిస్తున్నారా అనే అనేక ప్రశ్నలు ప్రజల మదిలో మెదులుతున్నాయి. ఎందుకంటే వంతెనలు ఒకదాని తర్వాత ఒకటి కూలిపోవడం మామూలు విషయం కాదు. దీనికి ముందు, ఇటీవల అరారియా, సివాన్‌లలో కూడా రెండు వంతెనలు కూలిపోయాయి. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే, వంతెన కూలిన సమయంలో ఆ వంతెనపై ఎవరూ లేరు. దీంతో పెద్ద ప్రమాదం జరిగినట్లు సమాచారం లేదు.