PM Modi: 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన
ఈ వార్తాకథనం ఏంటి
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్లను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం శంకుస్థాపన చేశారు.
లక్షలాది మంది ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్‌లను అత్యాధునిక సౌకర్యవంతంగా మార్చమే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ప్రపంచ స్థాయి ప్రజా రవాణాను అందించే లక్ష్యంతో ప్రధాని మోదీ అమృత్ భారత్ స్టేషన్ పథకం పథకాన్ని తీసుకొచ్చినట్లు కేంద్రం చెబుతోంది.
దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు రైళ్లను తమ ప్రయాణ మార్గాలుగా ఎంచుకుంటున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్లను పునరుద్ధరించాల్సిన ఆవశ్యకతను మోదీ నొక్కి చెప్పారు.
ఈ పథకం దేశవ్యాప్తంగా మొత్తం 1309 స్టేషన్లను పునరుద్ధరించనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
శంకుస్థాపన చేస్తున్న ప్రధాని మోదీ
#WATCH | Prime Minister Narendra Modi lays the foundation stone to redevelop 508 railway stations across India under Amrit Bharat Station Scheme. pic.twitter.com/Uup2xzo20a
— ANI (@ANI) August 6, 2023
మోదీ
ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ నుంచి ఎక్కువ స్టేషన్ల ఎంపిక
అమృత్ భారత్ స్టేషన్ పథకం తొలి విడుతలో భాగంగా 508 స్టేషన్ల పునరుద్ధరణకు ప్రధాని శంకుస్థాపన చేశారు.
ఈ స్టేషన్లను రూ.24,470 కోట్లకు పైగా వెచ్చించి అభివృద్ధి చేయనున్నారు.
స్టేషన్ల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌లు సిద్ధం చేశారు. 27 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఈ 508 రైల్వే స్టేషన్లను పునరుద్ధరణ కోసం ఎంపిక చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి అత్యధికంగా 55 స్టేషన్ల చొప్పున ఎంపిక చేసారు.
బిహార్ నుంచి 49స్టేషన్లు, మహారాష్ట్రలో 44, పశ్చిమ బెంగాల్‌లో 37 స్టేషన్లను ఎంపిక చేశారు.
ఈ పునరుద్ధణలో భాగంగా ఆధునిక సౌకర్యాలు, ట్రాఫిక్ లేకుండా చూడటం, ఇంటర్-మోడల్ ఇంటిగ్రేషన్, ప్రయాణీకుల మార్గదర్శకత్వాన్ని సులభతరం చేయడంపై ఫోకస్ పెట్టనున్నారు.