Union Cabinet: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. జనగణనకు రూ.11,718 కోట్ల బడ్జెట్ కేటాయింపు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ ఈ శుక్రవారం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిలో అత్యంత ముఖ్యమైనది జనగణన కోసం నిధులు కేటాయించడం. ఈ సందర్భంలో, రూ.11,718 కోట్ల వ్యయంని జనగణన కోసం కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. 2027లో రెండు విడతల్లో ఈ జనగణన జరుగనుంది. ప్రత్యేకంగా, ఈసారి డిజిటల్ సాంకేతికతను ఉపయోగించి జనగణన నిర్వహించనున్నట్లు నిర్ణయించారు. ఇదే దేశంలో డిజిటల్ విధానంతో జరగబోయే తొలి జనగణన కావడం విశేషం.
వివరాలు
బొగ్గు గనుల రంగంలో సంస్కరణలు
కేంద్ర ప్రభుత్వం బొగ్గు సేతు పథకంలో విస్తృతమైన భాగస్వామ్యానికి సంబంధించి నూతన ప్రమాణాలకు ఆమోదం తెలిపిందని ఆయన తెలిపారు. వ్యాపారులకు మాత్రమే కాకుండా, ఇప్పుడు ఏ సాధారణ వినియోగదారుడైనా బొగ్గును ఉపయోగించడంపై ఎలాంటి నిరోధాలు లేకుండా ఈ పథకంలో చేరవచ్చని స్పష్టం చేశారు. అదేవిధంగా, లింకేజ్ కలిగిన సంస్థలకు వారి మొత్తం సామర్థ్యంలో 50 శాతం వరకు ఎగుమతి చేసే వీలును కల్పించారని వివరించారు. అయితే, ఈ నిబంధనలు కోకింగ్ కోల్‌కు వర్తించవని, దాని ఎగుమతిపై నిషేధం కొనసాగుతుందని స్పష్టంగా తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కేంద్ర క్యాబినెట్ నిర్ణయాల మీడియాకు తెలుపుతున్న ను అశ్విని వైష్ణవ్
#Watch | केंद्रीय मंत्री @AshwiniVaishnaw आज महत्वपूर्ण सरकारी निर्णयों, विकास परियोजनाओं और आने वाली नीतिगत पहलों पर विस्तार से जानकारी दे रहें हैं ।
— डीडी न्यूज़ (@DDNewsHindi) December 12, 2025
लाइव देखें : https://t.co/7Vk4dWbJTy@MIB_Hindi pic.twitter.com/y20Z4WZkyh
వివరాలు
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లుకు ఆమోదం
అలాగే కేంద్ర కేబినెట్ బీమా రంగంలో వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లుకు కూడా ఆమోదం తెలిపిందని అన్నారు. ఈ రంగంలో 100శాతం ఎఫ్‌డీఐకి అనుమతిస్తే, విదేశీ సంస్థలు భారతీయ కంపెనీలపై ఆధారపడకుండా సొంతంగా పనిచేయడానికి ఆస్కారం ఏర్పడుతుందని,దీనివల్ల ఈ రంగానికి మేలు జరిగే అవకాశాలున్నాయని కేంద్రం ఆలోచిస్తుంది. అదేవిధంగా,మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంకు సంబంధించి పేరు మార్చడానికి కూడా ఆమోదం ఇచ్చింది. ఇప్పుడు ఈ పథకాన్ని "పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకం"గా పిలుస్తారు. అలాగే,ఈ పథకం కింద ప్రతి వ్యక్తికి పని దినాలను 100 నుంచి 120 వరకు పెంచడానికి నిర్ణయించారు. కేంద్ర క్యాబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాలను మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించారు.