
Jyotiraditya Scindia: జ్యోతిరాతిద్య సింధియాకు మాతృవియోగం
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాతృమూర్తి మాధవిరాజే సింధియా అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు.
ఆమె గత కొంత కాలంగా నిమోనియాతో బాధ పడుతున్నారు.వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కన్నుమూశారు.
నేపాల్ రాజ కుటుంబానికి చెందిన మాధవిరాజే సింధియా గ్వాలియర్ సంస్ధానీధుశుడు మాధవ్ రావు సింధియా11ను వివాహమాడారు.
మాధవ్ రావు సింధియా కాంగ్రెస్ హాయంలో పౌర విమానాయన శాఖ మంత్రిగా పని చేశారు.
దివంగత ప్రధానులు ఇందిరా గాంధీ,రాజీవ్ గాంధీ,పివి నరసింహారావు హాయంలో కీలక మంత్రి పదవులు నిర్వహించారు.
ఢిల్లీలోని సఫ్ధర్ జంగ్ రోడ్డులోని మాధవ్ రావు సింధియా ఉన్న నివాసంలోనే ప్రస్తుతం ఆయన కుమారుడు ఉంటున్నారు.
మాధవి రాజే సింధియా అంత్య క్రియలు గ్వాలియర్ లో జరపనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కేంద్ర మంత్రికి మాతృవియోగం
Union Minister Jyotiraditya Scindia's mother Madhavi Raje passes away. pic.twitter.com/MqhT8Zjj3e
— News Arena India (@NewsArenaIndia) May 15, 2024