Page Loader
సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు కోచ్‌ల పెంపుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ
సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు కోచ్‌ల పెంపుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ

సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు కోచ్‌ల పెంపుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ

వ్రాసిన వారు Stalin
May 10, 2023
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ రైలుకు రోజురోజుకూ రద్దీ పెరుగుతోంది. సికింద్రాబాద్‌ -తిరుపతికి కేవలం ఎనిమిది గంటలే ప్రయాణ సమయం కావడంతో ప్రయాణికులు, యాత్రికులు రిజర్వేషన్లు చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. సికింద్రాబాద్‌-తిరుపతి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్న 8 కోచ్‌లను 16కో‌చ్‌లకు పెంచనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి వైష్ణవ్ కూడా కో‌చ్‌లను పెంచేందుకు అంగీకరించినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.

తిరుపతి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ

వాస్తవానికి సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు విశేష స్పందన వస్తోంది. 120 నుంచి 130 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. ఈ క్రమంలోనే ఆదరణ ఉన్న నేపథ్యంలో కో‌చ్‌ల సంఖ్యను పెంచాలని జి.కిషన్ రెడ్డి ప్రతిపాదనలు పంపారు. అంతేకాకుండా కో‌చ్‌ల సంఖ్యను పెంచాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు సర్వీస్ మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరుతుంది. రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.