
Suresh Gopi: నా ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది.. మళ్లీ సినిమాల్లో నటిస్తా: సురేశ్ గోపీ
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నానని కేంద్ర సహాయ మంత్రి సురేశ్ గోపీ వెల్లడించారు. కేరళకు చెందిన ఆయన ప్రస్తుతం పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సినీరంగం నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టిన ఈ బీజేపీ ఎంపీ, ఆదివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ సినిమాలను వదిలేసి మంత్రి కావాలని కోరుకోలేదని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో తన ఆదాయం గణనీయంగా తగ్గిందని, అందుకే మళ్లీ సినిమాల్లో నటించాలని ఉందని తెలిపారు. అలాగే, తాను వదిలివేస్తే తన మంత్రి పదవిని కేరళకే చెందిన రాజ్యసభ సభ్యుడు సదానందన్ మాస్టర్‌కి అప్పగించాలని కూడా సూచించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మళ్లీ సినిమాల్లో నటిస్తా: సురేశ్ గోపీ
"Income Has Stopped": Union Minister Offers To Resign, Wants To Resume Actinghttps://t.co/YL04RbT4iY@journalistaswin reports pic.twitter.com/ActIlpUIe7
— NDTV (@ndtv) October 13, 2025