Page Loader
సతీసమేతంగా దిల్లీకి చేరిన రిషి సునక్​కు ఘన స్వాగతం​.. పర్యటన తనకెంతో స్పెషల్​ అన్న ఇంగ్లీష్ ప్రధాని
పర్యటన తనకెంతో స్పెషల్​ అన్న ఇంగ్లీష్ ప్రధాని

సతీసమేతంగా దిల్లీకి చేరిన రిషి సునక్​కు ఘన స్వాగతం​.. పర్యటన తనకెంతో స్పెషల్​ అన్న ఇంగ్లీష్ ప్రధాని

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 08, 2023
03:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిటన్​ ప్రధాన మంత్రి రిషి సునక్​ మధ్యాహ్నం దిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా సునక్ దంపతులకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అశ్విని కుమార్​ చౌబే ఘనంగా స్వాగతం పలికారు. సెప్టెంబర్​ 9, 10 తేదీల్లో జాతీయ రాజధాని వేదికగా G-20 సమావేశాలు జరగనున్ననేపథ్యంలో రిషి సునాక్, భార్య అక్షతా మూర్తితో కలిసి భారత్ కి వచ్చారు. బయల్దేరేముందు బ్రిటన్ మీడియాతో సునక్ సరదాగా సంభాషించారు. ఈ పర్యటన తనకెంతో ప్రత్యేకమన్నారు. భారత సంతతికి చెందిన తొలి బ్రిటన్​ ప్రధాని హోదాలో ఇక్కడికి రావడం సంతోషకరమన్నారు. తనని భారత అల్లుడు అనడాన్ని సరదాగా గుర్తుచేసుకున్నారు. ఆప్యాయతతోనే అలా పిలుస్తున్నారన్నారు. భారత్‌ తన మనసుకు చాలా దగ్గరి దేశమని సునాక్‌ అన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భారత గడ్డపై తొలిసారిగా అడుగుపెట్టిన రిషి సునక్