లక్నోలోని బీజేపీ ఎమ్మెల్యే నివాసంలో 24 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య
లక్నోలో ఆదివారం అర్థరాత్రి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ఎమ్మెల్యే యోగేష్ శుక్లా అధికారిక నివాసంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని హజ్రత్‌గంజ్ ప్రాంతంలో ఉన్న శుక్లా ప్రభుత్వ నివాసంలో ఈ ఘటన జరిగింది. మృతుడిని ఉత్తర్‌ప్రదేశ్ లోని బారాబంకి జిల్లాలోని హైదర్‌ఘర్‌కు చెందిన 24 ఏళ్ల శ్రేష్ట తివారీగా గుర్తించారు. లక్నోలోని బక్షి కా తలాబ్ (BKT) అసెంబ్లీ నియోజకవర్గ ప్రతినిధి,ఎమ్మెల్యే యోగేష్ శుక్లాతో సంబంధం ఉన్న మీడియా బృందంలో తివారీ సభ్యుడు. శుక్లా హజ్రత్‌గంజ్ నివాసంలో ఉరివేసుకున్న వ్యక్తి మృతదేహాన్ని పోలీసు అధికారులు గుర్తించారు.
కుటుంబ కలహాల కారణంగానే యువకుడు ఆత్మహత్య
కుటుంబ కలహాల కారణంగానే యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. శ్రేష్ట తివారీ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపామని, ఈ విషయంపై తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.