
Uttar Pradesh: 'యూపీలో విచిత్ర ఘటన'.. నిందితుడి బదులుగా జడ్జి కోసం యుపి పోలీసులు వేట!
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది.ఓసబ్ ఇన్‌స్పెక్టర్ చేసిన చిన్న పొరపాటు న్యాయవ్యవస్థను ఆశ్చర్యపరిచే స్థితికి తీసుకెళ్లింది.
నిందితుడికి నోటీసులు ఇవ్వాల్సిన చోట,న్యాయమూర్తికే వాటిని అందజేయాలని పోలీసులు ప్రయత్నించడం పట్ల న్యాయమూర్తి తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేశారు.
ఫిరోజాబాద్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ బన్వారిలాల్ అనే పోలీసు అధికారి ఒక దొంగతనం కేసులో కోర్టు జారీ చేసిన నోటీసులను నిందితుడికి అందజేయాల్సి ఉంది.
కానీ,అతడు చేసిన పొరపాటు వల్ల నిందితుడి పేరు బదులు,కోర్టు న్యాయమూర్తి నగ్మా ఖాన్ పేరే నోటీసులో రాసేశాడు.
ఈనోటీసులను సంబంధిత వ్యక్తికి ఇవ్వాలనే ఉద్దేశంతో బన్వారిలాల్ తగిన చిరునామాకు వెళ్లాడు.
అక్కడ"నగ్మా ఖాన్"అనే వారు ఎవరూ లేరని తెలియడంతో,అతను తిరిగి వచ్చి అదే విషయాన్ని జడ్జి నగ్మా ఖాన్‌కి నివేదించాడు.
వివరాలు
బన్వారిలాల్‌పై తగిన చర్యలు
ఈ విషయం విన్న న్యాయమూర్తి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
పోలీసు అధికారి నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఎత్తిచూపుతూ, ''కోర్టు ఎవరికీ నోటీసులు పంపించాలో, ఏ సందర్భంలో పంపాలో కూడా పోలీసులు గుర్తించలేకపోవడం నిజంగా ఆశ్చర్యకరం.నోటీసులను చదవకుండానే ఈ విధంగా పనిచేయడం బాధాకరం.నోటీసులను అందజేసే బాధ్యత గల వ్యక్తులు పూర్తి జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇటువంటి పొరపాట్లు తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు'' అని వ్యాఖ్యానించారు.
ఈ నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచిస్తూ, బన్వారిలాల్‌పై తగిన చర్యలు తీసుకోవాలని యూపీ పోలీసు డైరెక్టర్ జనరల్‌కి ఆదేశాలు ఇచ్చారు.
ఈ సంఘటన కొన్ని రోజుల క్రితమే జరిగినా, తాజాగా వెలుగులోకి వచ్చింది.