LOADING...
UP: 'యూపీలో షాకింగ్ ఘటన.. రాఖీ కట్టిన బాలికపై అత్యాచారం,హత్య 
'యూపీలో షాకింగ్ ఘటన.. రాఖీ కట్టిన బాలికపై అత్యాచారం,హత్య

UP: 'యూపీలో షాకింగ్ ఘటన.. రాఖీ కట్టిన బాలికపై అత్యాచారం,హత్య 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2025
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

అన్నగా రక్షణ కల్పిస్తాడన్న నమ్మకంతో తన బంధువైన యువకుడి చేతికి రాఖీ కట్టింది ఆ బాలిక. కానీ, ఆ బంధువు మాత్రం రాఖీ కట్టించుకున్న కొద్ది గంటల్లోనే ఆమె జీవితాన్ని చీకట్లోకి నెట్టేశాడు. అమానుషంగా ఆమెపై లైంగిక దాడి చేసి హత్య చేశాడు. తర్వాత ఆమె మృతదేహాన్ని తాడుకు వేలాడదీసి,అది ఆత్మహత్య అన్న భ్రమ కలిగించే ప్రయత్నం చేశాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అరేయియా జిల్లాలో తాజాగా చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. 33 ఏళ్ల సుర్జీత్‌ రాఖీ పండుగ సందర్భంగా తన బంధువు ఇంటికి వెళ్లాడు. అక్కడ అతడికి వరుస సోదరి వరసయ్యే ఆ బాలిక రాఖీ కట్టింది. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

వివరాలు 

ఘోరం జరుగుతున్న సమయంలో బాలిక తండ్రి పక్క గదిలోనే..

అదే రాత్రి మద్యం మత్తులో మళ్లీ ఆ ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో నిద్రిస్తున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడి, తర్వాత ఆమెను చంపేశాడు. ఆపై తాడుతో వేలాడదీసి, ఆత్మహత్యగా చూపించే ప్రయత్నం చేశాడు. ఈ దారుణం జరిగేటప్పుడు బాలిక తండ్రి పక్క గదిలోనే నిద్రపోతున్నాడు. కానీ ఏ శబ్దమూ వినలేదని పోలీసులకు తెలిపాడు. తర్వాతి రోజు ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడి పరిస్థితులు,రక్తపు మరకలు చూసిన పోలీసులు,ఇది ఆత్మహత్య కాదని తేల్చేశారు. దీంతో ఇంట్లో ఉన్న వారిని ఒక్కొక్కరిని ప్రశ్నించడం ప్రారంభించారు. ఆ సమయంలో సుర్జీత్ ప్రవర్తన వారిలో అనుమానం కలిగించింది.

వివరాలు 

అనుమానాస్పదంగా సుర్జీత్ తీరు  

ఇంట్లో ఎవరిని ప్రశ్నించినా తను జోక్యం చేసుకుని సమాధానం చెప్పాడు. . దీంతో అతడిని కూడా కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించగా, చివరికి తన నేరాన్ని ఒప్పుకున్నాడు. జిల్లా ఎస్పీ ప్రకటన ప్రకారం, పోస్ట్‌మార్టం నివేదికలో బాలికపై లైంగిక దాడి జరిగినట్లు స్పష్టమైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. రాఖీ కట్టిన చెల్లెలుపైనే ఇంత క్రూరంగా ప్రవర్తించాడని తెలుసుకుని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.