NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / UttarPradesh : 2.5 లక్షల మంది ఉద్యోగుల జీతాలను ఆపేసిన ఉత్తర్‌ప్రదేశ్  ప్రభుత్వం.. కారణం ఏంటంటే..!!
    తదుపరి వార్తా కథనం
    UttarPradesh : 2.5 లక్షల మంది ఉద్యోగుల జీతాలను ఆపేసిన ఉత్తర్‌ప్రదేశ్  ప్రభుత్వం.. కారణం ఏంటంటే..!!
    2.5 లక్షల మంది ఉద్యోగుల జీతాలను ఆపేసిన ఉత్తర్‌ప్రదేశ్  ప్రభుత్వం

    UttarPradesh : 2.5 లక్షల మంది ఉద్యోగుల జీతాలను ఆపేసిన ఉత్తర్‌ప్రదేశ్  ప్రభుత్వం.. కారణం ఏంటంటే..!!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 03, 2024
    02:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని దాదాపు 2.5 లక్షల మంది రాష్ట్ర ఉద్యోగులకు ఆగస్టు నెల జీతాలు లేవు. ఈ ఉద్యోగుల ఆస్తుల వివరాలు ఇవ్వనందుకు రాష్ట్ర ప్రభుత్వం వారి జీతాలను నిలిపివేసింది.

    కొత్త ఆర్డర్ ప్రకారం, ఉద్యోగులు ఆగస్టు 31 లోగా మానవ సంపద పోర్టల్‌లో ఆస్తి వివరాలను అప్‌లోడ్ చేయాలి.

    శాఖల నివేదికల ఆధారంగా, 2,44,565 మంది ఉద్యోగులు చివరి తేదీ దాటినా ఉత్తర్వులను పాటించలేదు, దీని కారణంగా వారి జీతాలు నిలిచిపోయాయి.

    వివరాలు 

    75 శాతం మంది ఉద్యోగులు సమాచారం ఇచ్చారు 

    ఉద్యోగులందరూ తమ ఆస్తుల వివరాలను వెల్లడించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆగస్టు 17న ఉత్తర్వులు జారీ చేశారు.

    ఆగస్టు 31లోగా ఆస్తులు వెల్లడించిన వారికే ఆగస్టు నెల జీతాలు ఇవ్వాలని అన్ని శాఖలను ఆదేశించారు.

    రాష్ట్రంలో మొత్తం 8,46,640 మంది రాష్ట్ర ఉద్యోగులు ఉండగా, వీరిలో 75 శాతం (6,02,075) ఉద్యోగులు మాత్రమే గడువు తేదీ వరకు మానవ సంపద పోర్టల్‌లో తమ చర, స్థిరాస్తుల వివరాలను అప్‌లోడ్ చేశారు.

    వివరాలు 

    ఇప్పుడు ఉద్యోగులందరూ తమ ఆస్తులను వెల్లడించాల్సి ఉంటుంది 

    యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ప్రొఫెషనల్ ఆఫీసర్ల తరహాలో ఇతర సర్వీసుల ఉద్యోగులు ఆస్తుల వివరాలను అందించడాన్ని తప్పనిసరి చేసింది.

    ఈ ఆదేశాలలో టీచర్లు, కార్పొరేషన్ ఉద్యోగులు, అటానమస్ సంస్థల ఉద్యోగులను చేర్చలేదు.

    ఆగస్టు నెల జీతం నిలిపివేసిన ఉద్యోగులకు వారి ఆస్తుల వివరాలను తెలిపిన తర్వాతే వేతనాలు విడుదల చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ
    IPL 2025: మాకు అన్యాయం జరిగింది... ఐపీఎల్ అధికారులపై మండిపడ్డ కోల్‌కతా ఐపీఎల్
    Bengaluru: బెంగళూరులో దారుణం.. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యం.. బెంగళూరు
    Team india: ఇంగ్లాండ్ టూర్‌కు ముందు కీలక నిర్ణయం.. కెప్టెన్ ఎవరో తేలేది ఆ రోజే! భారత జట్టు

    ఉత్తర్‌ప్రదేశ్

    Karan Bhushan Singh: బ్రిజ్ భూషన్ కుమారుడి వాహనం ఢీ: ఇద్దరిమృతి  భారతదేశం
    Tragedy: యుపిలో దారుణం.. చెట్టు కింద నిద్రిస్తున్న 4గురిపైకి మృత్యు శకటం భారతదేశం
    Election results: ఉత్తర్‌ప్రదేశ్'లో సత్తా చాటిన ఇండియా కూటమి భారతదేశం
    Parliament: నకిలీ ఆధార్ కార్డులు చూపించి పార్లమెంట్‌లోకి ప్రవేశించిన ముగ్గురి అరెస్ట్  పార్లమెంట్ భవనం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025