Page Loader
Supreme Court: యూపీ మదర్సా ఎడ్యుకేషన్‌ చట్టం రాజ్యాంగబద్ధమే: సుప్రీంకోర్టు  
యూపీ మదర్సా ఎడ్యుకేషన్‌ చట్టం రాజ్యాంగబద్ధమే: సుప్రీంకోర్టు

Supreme Court: యూపీ మదర్సా ఎడ్యుకేషన్‌ చట్టం రాజ్యాంగబద్ధమే: సుప్రీంకోర్టు  

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2024
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వేలాది మదర్సాలకు సుప్రీంకోర్టు లో భారీ ఊరట లభించింది. యూపీ మదర్సా ఎడ్యుకేషన్ చట్టం రాజ్యాంగబద్ధమేనని మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది. ఈ తీర్పుతో అలహాబాద్ హైకోర్టు ఇంతకుముందు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. అలహాబాద్ హైకోర్టు గతంలో ఉత్తర్‌ప్రదేశ్ మదర్సా చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొని దానిని రద్దు చేసింది. అది లౌకికవాద భావనకు వ్యతిరేకమని పేర్కొంది. ఆ తీర్పును సవాలు చేస్తూ, కేసు సుప్రీంకోర్టు వద్దకు చేరింది. సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పు సరైనది కాదని, ఈ తీర్పు 10వేల మంది మదర్సా టీచర్లు, 17 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. తాజా తీర్పుతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని 16వేల మదర్సాల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మదర్సా ఎడ్యుకేషన్‌ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు