Page Loader
Uttar Pradesh: ముస్లిం విద్యార్థిని చెప్పుతో టీచర్ కొట్టించడంపై సుప్రీంకోర్టు సీరియస్
ముస్లిం విద్యార్థిని చెప్పుతో టీచర్ కొట్టించడంపై సుప్రీంకోర్టు సీరియస్

Uttar Pradesh: ముస్లిం విద్యార్థిని చెప్పుతో టీచర్ కొట్టించడంపై సుప్రీంకోర్టు సీరియస్

వ్రాసిన వారు Stalin
Sep 25, 2023
03:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని ఓ పాఠశాల టీచర్ ముస్లిం స్టూడెంట్‌ను సహవిద్యార్థులతో చెప్పుతో కొట్టించిన ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని మందలించింది. అంతేకాకుండా ఈ సంఘటనకు యూపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ ఘటన జరిగిన తీరు దిగ్భ్రాంతికి గురి చేసిందని ధర్మాసనం పేర్కొంది. ఈ అలాగే బాధిత విద్యార్థితో పాటు ఇతర విద్యార్థులకు ప్రొఫెషనల్ కౌన్సెలర్ల నుంచి కౌన్సెలింగ్ ఇప్పించాలని ఆదేశించింది. విద్యార్థిని కొట్టిన సంఘటన వీడియో గత నెలలో వైరల్‌గా మారింది. దీంతో ఈ ఘటనపై మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారించింది.

ముస్లిం

సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారించాలి: ధర్మాసనం 

ఒక విద్యార్థిని ఫలానా వర్గానికి చెందిన వ్యక్తి అనే కారణంతో శిక్షించాలని అనుకోవడం సరైందా? ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించే విధానం ఇదేనా? అని ధర్మాసనం ప్రశ్నించింది. విద్యార్ధులను శారీరకంగా, మానసికంగా వేధించడం, వారిపై వారి వివక్షను నిషేధించే విద్యాహక్కు చట్టం (ఆర్‌టీఐ) చట్టంలోని నిబంధనలను పాటించడంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ కేసు విచారణలో ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ కోసం సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించి మూడు వారాల్లోగా కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.