
UP women's body: మహిళల దుస్తుల కొలతలను పురుష దర్జీలు తీసుకోవద్దు.. యూపీ మహిళా కమిషన్
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్ మహిళా కమిషన్ (Uttar Pradesh State Women Commission) పురుషుల దురుద్దేశాలను నిరోధించడంతో బాటు 'బ్యాడ్ టచ్' నుంచి మహిళలను రక్షించడంలో కీలక ప్రతిపాదనలు చేసింది.
కమిషన్ పురుష దర్జీలు మహిళల దుస్తుల కొలతలు తీసుకోకూడదని, అమ్మాయిల శిరోజాలు కత్తిరించే పనులు చేయకూడదని సూచించింది.
మహిళా కమిషన్ సభ్యురాలు హిమానీ అగర్వాల్ ఈ ప్రతిపాదనలు ఇటీవల జరిగిన సమావేశంలో వెల్లడించారు.
హిమానీ అగర్వాల్ ప్రకారం, "ఇలాంటి వృత్తుల్లో ఉన్న పురుషులు అమ్మాయిలను అసభ్యంగా తాకడం ద్వారా వేధించేందుకు అవకాశాలున్నాయి. అలాంటి వాటి నుంచి మహిళలను రక్షించేందుకు ఈ ప్రతిపాదనలు చేశాం" అని తెలిపారు.
వివరాలు
కమిషన్ ప్రతిపాదనలు
మహిళల దుస్తుల కొలతలు తీసుకోవడానికి మహిళా సిబ్బందినే నియమించాలి. ఇవి జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలి.
సెలూన్‌లలో మహిళా కస్టమర్లకు కేవలం మహిళా సిబ్బందే సేవలందించాలి.
జిమ్, యోగా సెంటర్లలో మహిళా ట్రైనర్లే ఉండాలి. అలాంటి సెంటర్లను అవసరమైతే వెరిఫికేషన్ చేయాలి.
స్కూల్ బస్సుల్లో తప్పనిసరిగా మహిళా ఆయా లేదా ఉపాధ్యాయిని ఉండాలి.
డ్యాన్స్, డ్రామా వంటి కళా కేంద్రాల్లో అమ్మాయిలకు మహిళా టీచర్లే ఉండాలి.
మహిళా వస్తువులను విక్రయించే దుకాణాల్లో కేవలం మహిళా సిబ్బందే ఉండాలి.
కోచింగ్ సెంటర్లలో సీసీటీవీలు ఏర్పాటు చేయాలి.
వివరాలు
వైరల్ అవుతున్న ప్రతిపాదనలు
ఈ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని, వీటిని అమలు చేయడానికి చట్టం తీసుకురావాలని యూపీ ప్రభుత్వాన్ని కోరనున్నట్లు హిమానీ అగర్వాల్ తెలిపారు.
ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చకు దారితీశాయి.