UPSC CSE Result 2023 declared : యూపీఎస్సీ ఫలితాలు విడుదల.. అగ్రస్థానంలో ఆదిత్య శ్రీవాస్తవ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 (UPSC సివిల్ సర్వీసెస్ ఫలితాలు 2023) తుది ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను UPSC upsc.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఆదిత్య శ్రీవాస్తవ పరీక్షలో టాపర్‌గా నిలిచాడు. అనిమేష్ ప్రధాన్ రెండో స్థానంలో, తెలుగు విద్యార్థిని దోనూరి అనన్యారెడ్డి తృతీయ స్థానంలో, పీకే సిద్ధార్థ్ రామ్‌కుమార్ నాలుగో స్థానంలో, రుహాని ఐదో స్థానంలో నిలిచారు.
1,016 మందిని ఎంపిక చేసిన యూపీఎస్సీ
మొత్తం 1,016 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. జనరల్ కేటగిరి కింద 347, ఈడబ్ల్యూఎస్ కింద 115, ఓబీసీ కింద 303, ఎస్సీ కేటగిరి కింద 165, ఎస్టీ కేటగిరి కింద 86 మందిని ఎంపిక చేశారు. 180 మంది ఐఏఎస్ పోస్టులకు, 37 మంది ఐఎఫ్ఎస్ పోస్టులకు, 200 మంది ఐపీఎస్ పోస్టులకు, 613 మంది సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ పోస్టులకు, 113 మంది గ్రూప్ బీ సర్వీసులకు ఎంపికయ్యారు.