ఎయిర్ ఇండియా కేసులో ట్విస్ట్: 'మూత విసర్జన నేను చేయలేదు, ఆమెనే చేసుకుంది'
ఎయిర్ ఇండియా విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్ మిశ్రా కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. తాను ఆ మహిళపై మూత్ర విసర్జన చేయలేదని, ఆమెపై ఆమెనే చేసుకుందని కోర్టులో శంకర్ మిశ్రా తరఫు లాయర్ కోర్టులో వాదించారు. విమానంలో తనపై ఫిర్యాదు చేసిన మహిళ సీటు వద్దకు వెళ్లడం అసాధ్యమని శంకర్ మిశ్రా చెప్పారు. వెనక నుంచి మాత్రమే ఆమె సీటు వద్దకు వెళ్లడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. వెనక సీటు నుంచి మూత్ర విసర్జన చేస్తే.. ఆమెపై పడే అవకాశం లేదని వెల్లడించారు. ఆమె ప్రోస్టేజ్ సమస్యతో బాధపడుతున్నట్లు, దాని వల్లే ఆమె తనపై తానే మూత్ర విసర్జన చేసుకుందని కోర్టులో వాదనలు వినిపించారు.
కథక్ డ్యాన్సర్లలో 80శాతం మందికి ప్రోస్టేజ్ సమస్య: శంకర్
శంకర్ మిశ్రా.. మరో ఆసక్తికర విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. తనపై ఫిర్యాదు చేసిన మహిళ కథక్ డ్యాన్సర్ అని చెప్పారు. కథక్ డ్యాన్సర్లలో దాదాపు 80శాతం మంది ప్రోస్టేజ్ సమస్యతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. తనపై ఫిర్యాదు చేసిన మహిళ కూడా అదే సమస్యతో బాధపడుతున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే ఆమె తనపై తాను మూత్ర మూత్రవిసర్జన చేసుకున్నట్లు వెల్లడించారు. నవంబర్ 26, 2022న న్యూయార్క్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం బిజినెస్ క్లాస్‌లో మద్యం మత్తులో శంకర్ మిశ్రా.. తొటి మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో మిశ్రా 14రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు.